Vastu Tips for Money: ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా.. ఈ ఎఫెక్టివ్ వాస్తు చిట్కాలను ట్రై చేసి చూడండి

జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మంది సమస్య ఏమిటంటే.. డబ్బును పొదుపు చేయలేరు. అంతేకాదు తాము పొదుపు చేసిన డబ్బులను కూడా అకస్మాత్తుగా ఏదో ఒక పనికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలబడవు. ఇలా జరగడానికి కొన్ని సార్లు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణమని నమ్మకం. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఎంత డబ్బు  సంపాదించినా.. ఎంత పొదుపు కోసం ప్రయత్నించినా ఆ ఇంట్లో నిలబడదు.

Vastu Tips for Money: ఎంత సంపాదించినా డబ్బులు నిలవడం లేదా.. ఈ ఎఫెక్టివ్ వాస్తు చిట్కాలను ట్రై చేసి చూడండి
Vastu Tips For Money
Follow us
Surya Kala

|

Updated on: Jan 30, 2024 | 9:01 AM

డబ్బు ప్రతి ఒక్కరూ పొదుపు చేయాలనుకునేది. ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఆదుకునేందుకు డబ్బులు లేదా బంగారమే అందుబాటులో ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, పిల్లల చదువులు, పెళ్లిళ్ల ఖర్చులు, వృద్ధాప్యంలో జీవించడానికి కావల్సినంత డబ్బు తమ వద్ద ఉండాలని.. తద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే చాలా మంది సమస్య ఏమిటంటే.. డబ్బును పొదుపు చేయలేరు. అంతేకాదు తాము పొదుపు చేసిన డబ్బులను కూడా అకస్మాత్తుగా ఏదో ఒక పనికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో నిలబడవు.

ఇలా జరగడానికి కొన్ని సార్లు ఇంట్లో వాస్తు దోషం కూడా కారణమని నమ్మకం. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఎంత డబ్బు  సంపాదించినా.. ఎంత పొదుపు కోసం ప్రయత్నించినా ఆ ఇంట్లో నిలబడదు. డబ్బు నీళ్లలా ఖర్చు చేస్తారు. వాస్తు ప్రకారం దక్షిణం, వాయువ్యం, ఈశాన్య దిశలు డబ్బు దిశలుగా పరిగణించబడతాయి. ఈ దిశలలో ఏదైనా దోషం ఉంటే ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉంటుంది. కనుక ఈ రోజు వాస్తు శాస్త్రానికి సంబంధించిన కొన్ని సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ చర్యలు చేపట్టిన అనంతరం డబ్బుని పొదుపు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని విశ్వాసం.

  1. వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య దిశను సంపద దిశగా పరిగణిస్తారు. ఈ దిశను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని గుర్తుంచుకోండి. ఈ దిశలో ఎలాంటి విరిగిన వస్తువులను ఉంచవద్దు. ఇంటి ఈశాన్య దిశలో మురికి లేదా విరిగిన వస్తువులను ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వ ఉండదని వాస్తు శాస్త్రం పేర్కొంది.
  2. ఈశాన్య దిశలో చీకటి: వాస్తు ప్రకారం ఈశాన్య దిక్కును సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి స్థానంగా భావిస్తారు. కాబట్టి పొరపాటున కూడా ఈశాన్య దిశను చీకటిగా ఉంచవద్దు. ఈ ప్రదేశంలో ఎల్లప్పుడూ తగినంత లైటింగ్ ఉంచండి. ఈశాన్య దిశలో చీకటి కారణంగా ధన నష్టం కలిగే అవకాశం ఉందని విశ్వాసం.
  3. ఇవి కూడా చదవండి
  4. దక్షిణ దిశలో డబ్బులను దాచే వస్తువులను ఉంచవద్దు: వాస్తు ప్రకారం ఇంటి దక్షిణ దిశను యమ దిక్కుగా పరిగణిస్తారు. కనుక ఈ దిక్కులో పొరపాటున కూడా డబ్బులను దాచుకునే వస్తువులను పెట్టుకోవద్దు.
  5. ఈశాన్యంలో వంటగదిని నిర్మించవద్దు: ఇంటిని నిర్మించేటప్పుడు వంటగది ఈశాన్య దిశలో నిర్మించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. వంటగది ఈ దిశలో ఉంటే ఇంటిలోని సభ్యుల ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది.
  6. ఈ వస్తువులు ఇంటి మధ్యలో ఉండకూడదు: వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మధ్యలో టాయిలెట్, మెట్లు, బరువైన వస్తువులు ఉండకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. మెట్ల ఏర్పాటుకు వాయువ్య దిశ సరైనదిగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు