AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: కోనసీమ వాసుల అభిమానం అంటే ఇదే మరి.. వారధికి కలెక్టర్ పేరు నామకరణం

కోనసీమ జిల్లా ప్రజల కష్టాలు తెలుసుకొని.. స్వయంగా చొరవ తీసుకొని వారధి నిర్మించిన జిల్లా కలెక్టర్ సేవలకు గాను.. ఆయన పేరునే వారధికి పెట్టారు ఆప్రాంత ప్రజలు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన జిల్లా కలెక్టర్‌ గుర్తుగా వారధికి నామకరణం చేశారు. కోనసీమ జిల్లాలో లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తడం.. ఆవిషయం జిల్లా అధికారుల దృష్టికి రావడంపై స్పందించారు కలెక్టర్ హిమాన్షు శుక్లా.

Konaseema: కోనసీమ వాసుల అభిమానం అంటే ఇదే మరి.. వారధికి కలెక్టర్ పేరు నామకరణం
Himanshu Shukla
Surya Kala
|

Updated on: Jan 30, 2024 | 6:33 AM

Share

కోనసీమ జిల్లా వాసులు తమకు మేలు చేసిన వారిని  జీవితంలో మరచిపోరు.. దైవంగా కొలుస్తారు ఈ విషయం కాటన్ దొర విషయంలో అందరికి తెలిసిందే..  తాజాగా మరోమారు తమ కష్టాన్ని గుర్తించి ఆ కష్టాన్ని తీర్చడానికి ప్రధాన పాత్ర పోషిచిన కలెక్టర్ విషయంలో కూడా తమ ప్రేమ, అభిమానాన్ని భిన్న పద్ధతిలో  చాటుకున్నారు. కలెక్టర్ వారి ప్రత్యేక చొరవతో స్వయంగా నిధులు సమకూర్చి నిర్మించిన వంతెనకు హిమాన్షు శుక్లా వారిధి గా గ్రామస్తులు నామకరణం చేశారు.

కోనసీమ జిల్లా ప్రజల కష్టాలు తెలుసుకొని.. స్వయంగా చొరవ తీసుకొని వారధి నిర్మించిన జిల్లా కలెక్టర్ సేవలకు గాను.. ఆయన పేరునే వారధికి పెట్టారు ఆప్రాంత ప్రజలు. తమ జీవితాల్లో వెలుగులు నింపిన జిల్లా కలెక్టర్‌ గుర్తుగా వారధికి నామకరణం చేశారు. కోనసీమ జిల్లాలో లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తడం.. ఆవిషయం జిల్లా అధికారుల దృష్టికి రావడంపై స్పందించారు కలెక్టర్ హిమాన్షు శుక్లా. మామిడి కుదురు- అప్పనపల్లి కి వెళ్లే కొర్లకుంట వారధిని ప్రత్యేక చొరవతో స్వయం పరపతితో సుమారు రూ 54 లక్షలు మేర నిధులు సమకూర్చి బ్రిడ్జి నిర్మించారు జిల్లా కలెక్టర్. వంతెనను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా ప్రారంభించారు. ఈబ్రిడ్జ్‌కి గ్రామస్తులు హిమాన్షు శుక్లా వారిధిగా నామకరణం చేశారు. ఈవంతెన పూర్తి కావడంతో పెదపట్నం, పెదపట్నంలంక, అప్పనపల్లి , దొడ్డవరం, గ్రామాలకు వరద ముంపు బెడద పూర్తిగా తప్పింది.

ఇవి కూడా చదవండి

అలాగే మండల పరిషత్ నిధుల నుండి సుమారుగా 5లక్షల20 వేలతో వంతెనకి ఇరువైపులా సిసి రోడ్లను నిర్మించి ప్రారంభించారు. వరదల సమయంలో లంక గ్రామాల కష్టాలను స్వయంగా తెలుసుకున్న తాను చలించిపోయానని తెలిపారు. రహదారి సౌకర్యం లేక ఇక్కట్ల పడుతున్న ఈప్రాంత ప్రజల రాకపోకలను వెంటనే పునరుద్దరించాలనే సంకల్పంతో స్వయంగా తాను రంగంలోకి దిగి .. వివిధ వర్గాల నుంచి నిధులు సేకరించి వంతెన నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు కలెక్టర్ హిమాన్షు శుక్లా. రోడ్డుకు ఇరు వైపులా సిసి రోడ్లు నిర్మించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వారధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..