AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success story: ఆడపిల్లకు చదువు వద్దులే అనుకున్న పరిస్థితుల నుంచి.. వార్డు వాలంటీర్ నుంచి ఎస్సై.. వరకూ

ఒకవైపు చదువుతూనే సేవాభావాన్ని అలవర్చుకున్నారు అంజుమ్. క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు తెలుసుకొని వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో.. వార్డు వాలంటీర్ గా చేరారు. ఆ తర్వాత రెండు మూడు నెలలకే.. ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించి వన్ టౌన్ లో సేవ చేశారు. పెళ్లిడుకు రావడంతో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పేరెంట్స్.. వచ్చిన సంబంధాలు ఆమె ఆశయాలకు అవరోదాలుగా మారే పరిస్థితులు కనిపించడంతో.. మ్యారేజ్ బ్యూరోలో ఆమె ప్రొఫైల్ ను అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టు ఉన్న యువకుడిని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారామె.

Success story: ఆడపిల్లకు చదువు వద్దులే అనుకున్న పరిస్థితుల నుంచి.. వార్డు వాలంటీర్ నుంచి ఎస్సై.. వరకూ
Success Story
Maqdood Husain Khaja
| Edited By: Ravi Kiran|

Updated on: Jan 12, 2024 | 10:09 AM

Share

ఆడపిల్ల చదువు కొంత వరకు చాలులే.. అని అనుకున్నారు. చదివించాలనుకున్నా కుటుంబ నేపధ్యం , ఆర్ధిక పరిస్థితులతో ఆమెను ఉన్నత చదువులకు పేరేంట్స్ సంశయించారు. అయితే ఆమె మాత్రం తన  తల్లిదండ్రుల పరిస్థితులను అర్ధం చేసుకుంది. పట్టుదల వదలకుండా తన ఆశయం నెరవేర్చుకోవడానికి  శ్రమిస్తూనే ఉంది. కాస్త ప్రోత్సాహం ఇవ్వడంతో.. చదువులో ఉన్నత స్థానాలను అధిరోహించి పుట్టినిల్లు, మెట్టినిల్లు కుటుంబ సభ్యుల మనసులు గెలుచుకుని జీవితాశయం వైవు మార్గాలను వేసుకుంటూ విజయాలు సొంతం చేసుకుంది.. వార్డు వాలంటీర్ తో మొదలై.. ఎస్సైకు ఎంపికై.. ఇంకా.. సివిల్స్ కోసం…ప్రయాణం సాగిస్తోన్న మహిళ సక్సెస్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..

విశాఖ కు చెందిన సాహిబా అంజుమ్ (27) స్వస్థలం బీహార్ లోని ఓ గ్రామం. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ కు వలస వచ్చేసారు. అప్పుడు వారిని ఆర్ధిక పరిస్థితులు కూడా అంతగా సహకరించలేదు. తండ్రి ఓ మసీదులో ఇమామ్ గా చేరారు. ఆతరువాత ఆరిలోవలోని మదరసాలో పిల్లలను చదివించే బాధ్యత తీసుకున్నారు. అంజుమ్ ప్రాథమిక విద్య పూర్తయింది. ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబానికి తోడు ఆర్థిక పరిస్థితుల్లో అంతంత మాత్రమే.. ఆపై ఆడపిల్ల..! పై చదువులు చదివించాలని స్తోమత లేక పేరెంట్స్ ధైర్యం చేయలేకపోయారు. చదువుకు పుల్ స్టాప్ పెట్టాలనే పరిస్థితి.. పేరెంట్స్ ను ఒప్పించి మంచి మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదవాలన్నా.. అంత ఖర్చు భరించగలమా అన్న ఆందోళన ఆ కుటుంబంలో మొదలైంది. తమ చదువు అక్కడితో ఆగిపోతుందన్న భయంతో మరింత కష్టపడి చదివిన అంజుమ్.. ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ ఫ్రీ సీటు సంపాదించించారు. ఆ చదువులో ఉండగానే.. లైబ్రరియన్ గా ఉద్యోగం చేస్తూ పుస్తకాలు చదివేవారు. ఆ తర్వాత ఫ్యాకల్టీగా కూడా పనిచేస్తూ.. ఏయూ నుంచి ఎంటెక్ నేవల్ ఆర్కిటెక్చర్ లో కోర్సు పూర్తి చేశారు.

వార్డు వాలంటీర్ నుంచి మొదలై…

ఒకవైపు చదువుతూనే సేవాభావాన్ని అలవర్చుకున్నారు అంజుమ్. క్షేత్రస్థాయిలో ప్రజల స్థితిగతులు తెలుసుకొని వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో.. వార్డు వాలంటీర్ గా చేరారు. ఆ తర్వాత రెండు మూడు నెలలకే.. ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించి వన్ టౌన్ లో సేవ చేశారు. పెళ్లిడుకు రావడంతో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పేరెంట్స్.. వచ్చిన సంబంధాలు ఆమె ఆశయాలకు అవరోదాలుగా మారే పరిస్థితులు కనిపించడంతో.. మ్యారేజ్ బ్యూరోలో ఆమె ప్రొఫైల్ ను అప్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఆశయాలు, ఆలోచనలకు తగ్గట్టు ఉన్న యువకుడిని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారామె.

ఇవి కూడా చదవండి

ఉత్తరాంధ్రలోనే మహిళా మైనార్టీ ఎస్సైగా..

పెళ్లి అయిన తర్వాత కూడా ఆమె ఆశయం కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ఇంతలో ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడడంతో.. దరఖాస్తు చేసి పరీక్షలకు హాజరయ్యారు. రిటర్న్ టెస్ట్ తో పాటు ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యేందుకు శ్రమించి సాధన చేశారు. అందులో సక్సెస్ ఫుల్ గా క్వాలిఫై అయ్యారు. ఉత్తరాంధ్రలోనే ఏకైక మైనార్టీ మహిళా విమెన్ ఎస్సైగా ఎంపికై ప్రశంసలు అందుకున్నారు. ఆమె చదువుతోపాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా భాగం పంచుకునేవారు. రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అత్యవసర సమయల్లో రక్తం అవసరం అనుకునే వారికి సహాయం చేయడం, ప్రజల్లో సామాజిక చైతన్యం తీసుకురావడం వంటి కార్యక్రమల్లో చురుగ్గా పాల్గొనె వారు. దీంతో ఆమె సేవలకు అవార్డులు రివార్డులు కూడా లభించాయి.

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని నా జీవిత ఆశయం. అందుకోసం యుపిఎస్సి సాధించడమే నా లక్ష్యం. పుట్టినిల్లు ప్రోత్సాహం ఇచ్చింది.. మెట్టినిల్లు వెన్నుతట్టుతుంది. కచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ నవుతా.. ఆ ఆశయంతోనే చేసిన ప్రిపరేషన్ తో ఎస్సై కు సెలెక్ట్ అయ్యా. అయినప్పటికీ నా టార్గెట్ మాత్రం యూపీఎస్సీ క్రాక్ చేయడమే. ప్రస్తుతం ఎంఏ సోషియాలజీలో ఆన్లైన్ పీజీ కోర్సు చేస్తున్నాను. ఆడపిల్లలకు చదువు వద్దన్నా.. ఒప్పించి మంచి ఫలితాలు సాధించి నమ్మకం కలిగించాలి. అప్పుడే జీవితంలో విజయాలు వరిస్తాయి.’ అని టీవీ9 తో అన్నారు సాహిబా అంజుమ్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..