Ayodhya: రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ.. చిహ్నంగా సూర్యుడు, దేవ కాంచన చెట్టు.. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే

రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి లలిత్ మిశ్రా రామాలయం జెండా ముసాయిదాను కూడా అందించారు. ఐదుగురు సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు కొత్త డిజైన్‌ను కమిటీ ముందుంచనున్నారు. దీని తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారు. రామ మందిరం శిఖరంపై అలంకరించనున్న ఈ జెండా చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం మలచబడిందని లలిత్ మిశ్రా చెప్పారు

Ayodhya: రామ మందిరంపై ఎగిరే జెండా రెడీ.. చిహ్నంగా సూర్యుడు, దేవ కాంచన చెట్టు.. వీటి ప్రాముఖ్యత ఏమిటంటే
Ayodhya Ram Mandir
Follow us

|

Updated on: Jan 11, 2024 | 5:14 PM

జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన  మహోత్సవం జరగనుండడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. కాగా రామాలయంపై ఎగురవేయాల్సిన జెండా డిజైన్‌ను మార్చినట్లు సమాచారం. రామ మందిరం పై ఎగిరే జెండాపై ఉదయిస్తున్న సూర్యుడు, లోపల జై  శ్రీ రామ్ నినాదం, కోవిదర్ చెట్టు (దేవ కాంచన చెట్టు) చిహ్నంగా చిత్రీకరించబడింది. శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి 100 జెండాలను పంపుతున్నారు. రేవాలోని హర్దువా గ్రామానికి చెందిన లలిత్ మిశ్రా వీటిని సిద్ధం చేశారు.

ఇటీవల రామ జన్మభూమి తీర్థం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కి లలిత్ మిశ్రా రామాలయం జెండా ముసాయిదాను కూడా అందించారు. ఐదుగురు సభ్యుల కమిటీ కూడా కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ఇప్పుడు కొత్త డిజైన్‌ను కమిటీ ముందుంచనున్నారు. దీని తర్వాత జెండా పొడవు, వెడల్పు నిర్ణయించనున్నారు. రామ మందిరం శిఖరంపై అలంకరించనున్న ఈ జెండా చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది.

సూర్యవంశ చిహ్నం సూర్యుడని, అందుకే ఈ జెండాపై సూర్యుని చిహ్నం మలచబడిందని లలిత్ మిశ్రా చెప్పారు. దేవ కాంచన చెట్టు.. అయోధ్య రాజ వృక్షం. భారతదేశంలో ప్రస్తుతం మర్రి చెట్టును జాతీయ వృక్షంగా పిలుస్తున్నట్లుగా.. ఆ సమయంలో దేవ కాంచన చెట్టుని రాజ వృక్షంగా పరిగణించేవారు.

పురాణాలలో దేవ కాంచన చెట్టు ప్రస్తావన

కాలక్రమేణా దేవ కాంచన చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ చెట్టు హిందూ మతపరమైన దృక్కోణంలో చూస్తే చాలా ముఖ్యమైనది. దీని ప్రస్తావన పురాణాలలో కూడా కనిపిస్తుంది. పురాణ విశ్వాసాల ప్రకారం ఋషి కశ్యపుడు ఈ చెట్టును సృష్టించాడు. ఈ చెట్టు ప్రస్తావన హరివంశ పురాణంలో కూడా ఉంది. ఈ పురాణాన్ని ప్రామాణికంగా తీసుకుని దేవ కాంచన చెట్టుని అయోధ్య రాజ జెండాలో చిత్రీకరించబడింది. అందుకే రామాలయంలోని జెండాలో ఈ చెట్టుని చిహ్నంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

వాల్మీకి మహర్షి వాల్మీకి రామాయణంలో ఈ చెట్టుని ప్రస్తావించారు. అలాగే ఈ చెట్టు పర్యావరణానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా ఈ చెట్టులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని అభ్యర్థించడానికి భరతుడు చిత్రకూటానికి  వెళ్లినప్పుడు భరతుడి రథంపై ఉన్న జెండాపై దేవ కాంచన చెట్టు ఉన్నట్లు పేర్కొన్నారు. అన్న రామయ్యతో పాటు వనవాసంలో ఉన్న లక్ష్మణుడు దూరం నుండి ఆ జెండాను చూసి గుర్తించి.. తమ వైపు వస్తోంది  అయోధ్య సైన్యం మాత్రమే అని ఊహించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే