Ram Mandir Inauguration: ‘జై శ్రీరామ్’.. అయోధ్య రామ మందిరం కోసం బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి విరాళం.. ఎంతంటే?
రాముడి గుడి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ భారీగా విరాళాలు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర' ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది భక్తులు గుడి నిర్మాణానికి తమ మంతు సాయమందించారు. తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆది రెడ్డి కూడా రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠాపనకు మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. జనవరి 22న జరిగే ఈ కార్యక్రమం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఆధ్వర్యంలో కనివినీ ఎరుగని చేతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే దేశ, విదేశాల్లోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగం కానున్నారు. ఇప్పటికే పలువురికి ఆహ్వానాలు కూడా వెళ్లాయి. ఇదిలా ఉంటే రాముడి గుడి కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులందరూ భారీగా విరాళాలు ఇచ్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది భక్తులు గుడి నిర్మాణానికి తమ మంతు సాయమందించారు. తాజాగా బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆది రెడ్డి కూడా రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించాడాయన. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘ జై శ్రీరామ్.. మన సబ్ స్క్రైబర్లందరూ బాగుండాలని, దాంతో పాటు మా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగుండాలని, ఇటీవలే నేను కొత్తగా ఓపెన్ చేసిన జావెద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ కూడా బాగా నడవాలని, నా భార్య, నా కూతురు, నా ఇంట్లో వాళ్లందరూ, అలాగే జనాలందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అయోధ్య రామ మందిరానికి నా వంతున, నా సబ్ స్క్రైబర్ల వంతున లక్ష రూపాయలు విరాళంగా అందించాను. ఈ రోజే డబ్బును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర డొనేట్ చేశాను’
‘మీరు కూడా అయోధ్య రామ మందిరానికి విరాళం పంపించండి. ఎందుకంటే ఇది మనందరి కల. మన భారతీయులు, హిందువులందరి కల. సో.. ఆ రామ మందిరానికి మన చేయూత నిస్తే చాలా బాగుంటుంది. మన పక్కనున్న దేవాలయాలు, గుడులకే ఎన్నో సార్లు విరాళాలు అందజేస్తాం. అలాంటిది మన అయోధ్య రామ మందిరానికి ఇవ్వకుండా ఉంటామా? ఇప్పుడే ఈ రామ మందిరం కోసం 3, 200 కోట్ల రూపాయలు విరాళాలుగా వచ్చాయట. ఇందులో ఒక లక్ష రూపాయలు మీ ఆది రెడ్డి కూడా ఇచ్చాడు. థ్యాంక్యూ.. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీరందరికీ ధన్యవాదాలు. మీ ఆదిరెడ్డి.. జై శ్రీరామ్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు ఆది రెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆది రెడ్డిని ప్రశంసిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అలాగే జై శ్రీరామ్ అంటూ హోరేత్తిస్తున్నారు.
మీరు కూడా విరాళమివ్వండి..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి