AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ‘సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు’.. నయన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ఇద్దరి పండంటి మగ కవలలకు ఈ స్టార్‌ కపుల్ జన్మనిచ్చారు. పెళ్లినాటి నుంచి ఈ జంట ఎంతో సంతోషంగా గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు టూర్‌ వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిత్యం పోస్ట్‌లు చేస్తూ తమ ప్రేమను చాటి చెబుతుంటారు...

Nayanthara: 'సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక పురుషుడు ఉంటాడు'.. నయన్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
Nayanthara
Narender Vaitla
|

Updated on: Jan 11, 2024 | 4:32 PM

Share

మోస్ట్‌ బ్యూటిఫుల్ సినీ సెలబ్రిటీస్‌లో నయనతార, విఘ్నేశ్‌లు ఒకరు. కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటైంది. 2022 జూన్‌ 9వ తేదీన ఎంతో మంది సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ జంట పెళ్లి పీటలెక్కింది. ఇక అనంతరం వీరిద్దరూ సరోగసి విధానంలో పిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.

ఇద్దరి పండంటి మగ కవలలకు ఈ స్టార్‌ కపుల్ జన్మనిచ్చారు. పెళ్లినాటి నుంచి ఈ జంట ఎంతో సంతోషంగా గడుపుతోంది. సమయం దొరికినప్పుడల్లా విదేశాలకు టూర్‌ వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక వీరిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని ఎప్పటికప్పుడు ఎక్స్‌ప్రెస్ చేస్తూనే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా నిత్యం పోస్ట్‌లు చేస్తూ తమ ప్రేమను చాటి చెబుతుంటారు.

ఈ క్రమంలోనే నయనతార తన భర్త విఘ్నేశ్‌పై ప్రశంసల జల్లు కురిపించింది. ఇటీవల ఓ ప్రైవేట్‌ కార్యక్రామానికి ఈ జంట హాజరైన సందర్భంగా.. నయనతార మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని మనం విన్నాం. కానీ, విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక పురుషుడు కచ్చితంగా ఉంటాడు. నేనే దీనికి ఉదాహరణ’ చెప్పుకొచ్చింది.

ఇక ఎన్నో ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్న తాను.. ఆ సినీ ప్రయాణంలోనే విఘ్నేశ్‌ను కలిశానని చెప్పుకొచ్చింది. విఘ్నేశ్‌ను కలిసిన రోజు నుంచి తాను చాలా సంతోషంగా ఉన్నానన్న నయనతార.. విఘ్నేశ్‌ ప్రతి విషయంలోనూ తనకు తోడుగా ఉంటూ ప్రోత్సాహిస్తున్నాడని, తన నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదని తెలిపింది. ఎన్నో పనుల్లో తనకు ధైర్యాన్ని ఇస్తూ నడిపిస్తున్నాడని, ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని కల్పించాడని, భర్తకు కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.

నయన్‌ కపుల్ లేటెస్ట్‌ ఫొటో..

ఇదిలా ఉంటే నయనతార అన్నపూరణి అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. అయితే తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి. ఈ సినిమా హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని నిర్మించిన జీ స్టూడియోస్‌, విశ్వహిందూ పరిషత్‌కు క్షమాపణలు చెబుతూ ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..
సిబిల్ స్కోర్ తక్కువుండి ఇబ్బంది పడుతున్నారా..? ఈ పనులు చేస్తే..