Annapoorani OTT: కాంట్రవర్సీ సినిమా.. ఆ ఓటీటీ డిలీట్.. ఇటు కొత్త ఓటీటీలో నయనతార మూవీ స్ట్రీమింగ్..

ఇందులోని కొన్ని డైలాగ్స్.. సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలపై.. ప్రస్తుతం స్ట్రీమింగ్ చేస్తోన్న ఓటీటీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అటు విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ సైతం అన్నపూరణి సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Annapoorani OTT: కాంట్రవర్సీ సినిమా.. ఆ ఓటీటీ డిలీట్.. ఇటు కొత్త ఓటీటీలో నయనతార మూవీ స్ట్రీమింగ్..
Follow us
Rajitha Chanti

| Edited By: Basha Shek

Updated on: Jan 11, 2024 | 9:30 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రావర్సీ సినిమా అన్నపూరణి గురించే చర్చ నడుస్తుంది. లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన ఈ మూవీ పలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోని కొన్ని డైలాగ్స్.. సన్నివేశాలు హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. లవ్ జిహాద్ ను ప్రోత్సహించేలా ఈ సినిమా ఉందంటూ శివసేన మాజీ నేత రమేశ్ సోలంకి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలపై.. ప్రస్తుతం స్ట్రీమింగ్ చేస్తోన్న ఓటీటీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అటు విశ్వహిందూ పరిషత్ నాయకుడు శ్రీరాజ్ నాయర్ సైతం అన్నపూరణి సినిమాపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులోని పలు డైలాగ్స్ హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని.. ఓటీటీ నుంచి ఈ చిత్రాన్ని తక్షణమే తొలగించాలని అన్నారు. దీంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంపై ఈ చిత్రాన్ని తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించింది.

అయితే ఉన్నట్లుండి అన్నపూరణి సినిమాను డిలీట్ చేయడంపై ఓవైపు విమర్శలు వస్తుండగా.. మరోవైపు మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అన్నపూరణి సినిమా మరో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అందుబాటులోకి వచ్చేసింది. సౌత్ ఇండియన్ సినిమాలకు చెందిన ప్రముఖ ఓటీటీ దిగ్గజం సింప్లీ సౌత్ (Simply South)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఈ కాంట్రావర్సీ మూవీ సింప్లీ సౌత్ లో చూడొచ్చు.

ఈ సినిమా విషయానికి వస్తే.. బ్రహ్మాణ కుటుంబంలో జన్మించిన అమ్మాయికి చెఫ్ కావాలనే కోరిక ఉంటుంది. చిన్నప్పటి నుంచి మంచి చెఫ్ కావాలని అనుకుంటుంది. కానీ బ్రహ్మాణ అమ్మాయి చెఫ్ కావడం.. మాంసాన్ని ముట్టుకోవడం.. వండడం అనేది పెద్ద సవాళ్లు. ఈ క్రమంలో తనకు ఎదురైన పరిస్థితులను అన్నపూరణి ఎలా ఎదుర్కొంది ? చివరకు తన కలను ఎలా సాధ్యం చేసుకుంది అనేది ? ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అంబులెన్స్‌ను వెంటాడిన మృత్యువు.. నలుగురు దుర్మరణం..!
అంబులెన్స్‌ను వెంటాడిన మృత్యువు.. నలుగురు దుర్మరణం..!
డేంజర్‌ జోన్‌లో భారతీయులు..ప్రపంచంలోనే అగ్రస్థానం.. సంచలన నివేదిక
డేంజర్‌ జోన్‌లో భారతీయులు..ప్రపంచంలోనే అగ్రస్థానం.. సంచలన నివేదిక
కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 25వేలలో బెస్ట్‌ ఇవే..
కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 25వేలలో బెస్ట్‌ ఇవే..
తమిళనాడు, పుదుచ్చేరిలో వరదల బీభత్సం
తమిళనాడు, పుదుచ్చేరిలో వరదల బీభత్సం
సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్‌తో కేవలం రూ. 500కే
సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్‌తో కేవలం రూ. 500కే
ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. లాభాలు
ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. లాభాలు
TRAI: అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ
TRAI: అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ
సొరకాయా.. మజాకా! లాబాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
సొరకాయా.. మజాకా! లాబాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
అమెరికా ఫ్లైట్ టికెట్ ధరలు ఉన్నఫళంగా అంత ఎందుకు పెరిగాయ్
అమెరికా ఫ్లైట్ టికెట్ ధరలు ఉన్నఫళంగా అంత ఎందుకు పెరిగాయ్
కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన నాదెండ్ల
కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన నాదెండ్ల
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర