Actor Siddharth : వాహ్.. సిద్దూ.. నీ వాయిస్‌లో ఏదో మ్యాజిక్ ఉంది.. మమ్మల్ని మాయ చేస్తుంది..
ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న సిద్ధూ.. ఆ తర్వాత మాత్రం అతడు నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగులో సిద్దూకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మహా సముద్రం సినిమాతో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శర్వానంద్ తో కలిసి నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
సిద్ధార్థ్.. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరో. ఇప్పటికీ ఎప్పటికీ ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంది. భాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్ధూ.. ఆ తర్వాత తెలుగులో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ చిత్రాలతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. నిజానికి కోలీవుడ్ హీరో అయిన సిద్ధూకు.. తెలుగులో అప్పట్లో బోలెడంత అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేది. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకున్న సిద్ధూ.. ఆ తర్వాత మాత్రం అతడు నటించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో తెలుగులో సిద్దూకు అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లకు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ షిఫ్ట్ అయ్యారు. అక్కడ వరుసగా సినిమాలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం మహా సముద్రం సినిమాతో మళ్లీ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. శర్వానంద్ తో కలిసి నటించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆయన నటించిన టక్కర్ అనే సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో తమిళంలోనే వరుస సినిమాలపై ఫోకస్ పెట్టారు సిద్ధూ.
ఇటీవలే చిత్త సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ గతేడాది విడుదలై తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలో మరోసారి తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు సిద్ధూ. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. ఈ చిత్రాన్ని తెలుగులో చిన్నా టైటిల్ తో రిలీజ్ చేయగా..పర్వలేదనిపించుకుంది. ఇదిలా ఉంటే.. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా.. స్క్రీన్ రైటర్ గా, గాయకుడిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇప్పటికే పలు చిత్రాల్లో ఎన్నో పాటలు పాడి అలరించారు సిద్ధూ. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియోలో మరోసారి తన అద్భుతమైన గాత్రంతో శ్రోతల హృదయాలను కదిలించాడు.
View this post on Instagram
ఇటీవల ఆయన నటించిన చిత్రం చిత్తాలోని ఓ పాటను వేదికపై పాడాడు సిద్దూ. ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్న పాటను సిద్దూ ఎంతో అలవోకగా పాడుతూ మైమరచిపోయాడు. ఈ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. సిద్దూ మల్టీటాలెంటెడ్.. ఎన్నో నైపుణ్యాలు కలిగిన వ్యక్తి.. ఈ పాటలో తన ఎమోషన్స్ ఎంతో అందంగా పలికించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సిద్దూ పాడిన పాటను మీరు చూసేయ్యండి.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.