Mahesh Babu: ‘థ్యాంక్ యూ గుంటూర్‌.. నా గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకం’.. గుంటూరు కారం ఈవెంట్‌పై మహేశ్‌

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్‌ కానుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Mahesh Babu: 'థ్యాంక్ యూ గుంటూర్‌.. నా గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకం'.. గుంటూరు కారం ఈవెంట్‌పై మహేశ్‌
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Jan 10, 2024 | 1:05 PM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో చిత్రం గుంటూరు కారం. వీరిద్దరి కలయికలో గతంలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు క్లాసిక్స్‌గా నిలిచాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మరోసారి ఈ కాంబో రిపీట్‌ కానుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మీనాక్షి చౌదరి సెకెండ్‌ లీడ్‌లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌, టీజర్స్‌, ట్రైలర్ గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెంచేశాయి. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుందీ సినిమా. ప్రమోషన్లలో భాగంగా మంగళవారం (జనవరి 10) గుంటూరు వేదికగా గుంటూరు కారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను గ్రాండ్‌గా నిర్వహించాడు. మహేశ్‌, శ్రీలీల, మీనాక్షి చౌదరి, త్రివిక్రమ్‌తో సహా చిత్రబృందమంతా ఈ ఈవెంట్‌లో సందడి చేసింది. ప్రి రిలీజ్‌ ఈవెంట్‌లో చాలా ఎమోషనల్‌ అయ్యారు మహేశ్‌. తండ్రిని మరోసారి గుర్తు తెచ్చుకున్నారు. తాజాగా గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌ సక్సెస్‌ కావడం పట్ల మరోసారి స్పందించారు. మహేశ్‌. ఈ ఈవెంట్‌కు సహకరించిన గుంటూరు ప్రజలతో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు సూపర్‌ స్టార్‌.

త్వరలోనే మీ అందరినీ మళ్లీ కలుస్తా..

‘థ్యాంక్ యూ గుంటూరు..నా సినిమా ఈవెంట్‌ పుట్టిన గడ్డపై జరుపుకోవడం ఆనందంగా ఉంది. ఇది గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞాపకం. మీ అందరినీ ప్రేమిస్తున్నా.. నా సూపర్ ఫ్యాన్స్‌ను మళ్లీ చూడాలని ఎదురు చూస్తున్నాను. అతి త్వరలోనే అందరమూ మళ్లీ కలుద్దాం. ఇప్పుడే సంక్రాంతి మొదలవుతోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి సహకరించిన గుంటూరు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు మహేశ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

మహేశ్ బాబు ట్వీట్..

నమ్రత ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి