Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda- Rashmika: ఫిబ్రవరిలో విజయ్‌, రష్మికల ఎంగేజ్‌మెంట్.. అసలు విషయం చెప్పేసిన రౌడీ బాయ్ టీమ్

టాలీవుడ్  రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మికల పెళ్లి చేసుకోనున్నారంటూ నెట్టింట పుకార్లు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమను ఇరు పెద్దలు కూడా ఆశీర్వదించారని ఇక పెళ్లే తరువాయి అంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఫిబ్రవరిలోనే విజయ్‌ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరగనుందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు, కథనాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Vijay Deverakonda- Rashmika: ఫిబ్రవరిలో విజయ్‌, రష్మికల ఎంగేజ్‌మెంట్.. అసలు విషయం చెప్పేసిన రౌడీ బాయ్ టీమ్
Rashmika Mandanna , Vijay Deverakonda
Follow us
Basha Shek

|

Updated on: Jan 08, 2024 | 5:56 PM

టాలీవుడ్  రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ, నేషనల్‌ క్రష్‌ రష్మికల పెళ్లి చేసుకోనున్నారంటూ నెట్టింట పుకార్లు మళ్లీ షికార్లు చేస్తున్నాయి. వీరి ప్రేమను ఇరు పెద్దలు కూడా ఆశీర్వదించారని ఇక పెళ్లే తరువాయి అంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఫిబ్రవరిలోనే విజయ్‌ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం జరగనుందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు, కథనాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ రూమర్లపై విజయ్‌ దేవరకొండ టీమ్‌ స్పందించింది. విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చిచెప్పింది. సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలను ఏ మాత్రం నమ్మవద్దని కోరింది.  గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా కనిపించారు విజయ్, రష్మిక. ఈ రెండు సినిమాల్లో రష్మిక, విజయ్ ల స్క్రీన్ ప్రజెన్స్ అందరినీ ఆకట్టుకుంది. చాలామందికి ఈ జోడీ ఫేవరేట్ గా మారిపోయింది. అదే సమయంలో విజయ్, రష్మికలు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. వీరు తరచూ పార్టీలు, ఫంక్షన్లు, డిన్నర్లకు కలిసి వెళుతుండడంతో ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు  తమ డేటింగ్ వార్తలను ఖండిస్తూ వస్తున్నారు విజయ్, రష్మిక. తామిద్దరం మంచి స్నేహితులమంటూ పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అయినా ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా మరోసారి విజయ్, రష్మికల ఎంగేజ్ మెంట్, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.  అయితే ఎప్పటిలాగే విజయ్ టీమ్ వీటిని కొట్టి పారేసింది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికొస్తే.. ఖుషి సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడు విజయ్ దేవర కొండ. గతడాది విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ గా రానున్నాడు రౌడీ బాయ్. ఇందులో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక రష్మిక విషయానికొస్తే.. ప్రస్తుతం ఇండియాలో ది మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్  ఈ ముద్దుగుమ్మేనని చెప్పుకోవచ్చు. ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది రష్మిక. రణ్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఏకంగా రూ. 800 కోట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం  అల్లు అర్జున్ తో రష్మిక  నటిస్తున్న పుష్ప 2 పైనే అందరి దృష్టి ఉంది.

విజయ్ దేవర కొండ, రష్మిక

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..