Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Police Force OTT: ఓటీటీలో అదిరిపోయే యాక్షన్‌ థ్రిల్లర్‌ .. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో సిద్ధార్థ మల్హోత్రా, సీనియర్‌ నటి శిల్పాశెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌, శ్వేతా తివారి, ముకేష్‌ రిషి, నికితిన్‌ ధీర్‌, రితురాజ్‌ సింగ్‌, లలిత్‌ పరిమో, శరద్ ఖేల్కర్‌.. ఇలా పలువురు ప్రముఖ నటీనటులు ఈ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌

Indian Police Force OTT: ఓటీటీలో అదిరిపోయే యాక్షన్‌ థ్రిల్లర్‌ .. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Indian Police Force Web Series
Follow us
Basha Shek

|

Updated on: Jan 07, 2024 | 9:15 PM

బాలీవుడ్‌లో భారీ యాక్షన్‌ సినిమాలు తీయడంలో డైరెక్టర్‌ రోహిత్ శెట్టి దిట్ట. ముఖ్యంగా పోలీసుల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సింగం సిరీస్‌, సింబా, సూర్యవంశీ సినిమాలు యాక్షన్‌ ప్రియులను బాగా అలరించాయి. ఇప్పుడు పోలీసుల నేపథ్యంలోనే ఓ పవర్ ఫుల్‌ యాక్షన్‌ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు రోహిత్‌. ఆయన దర్శకత్వంతో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్‌ డ్రామా ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌. బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరో సిద్ధార్థ మల్హోత్రా, సీనియర్‌ నటి శిల్పాశెట్టి, వివేక్‌ ఓబెరాయ్‌, శ్వేతా తివారి, ముకేష్‌ రిషి, నికితిన్‌ ధీర్‌, రితురాజ్‌ సింగ్‌, లలిత్‌ పరిమో, శరద్ ఖేల్కర్‌.. ఇలా పలువురు ప్రముఖ నటీనటులు ఈ వెబ్‌ సిరీస్‌లో నటిస్తుండడం విశేషం. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో జనవరి 19వ తేదీ నుంచి ఈ యాక్షన్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌ ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

దేశ ప్రజలను కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్న భారతీయ పోలీసు అధికారుల నిస్వార్థ సేవలకు అద్దం పట్టేలా ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ వెబ్‌ సిరీస్‌ ను తెరకెక్కించారు రోహిత్‌ శెట్టి. రోహిత్‌శెట్టితోపాటు సుశ్వంత్ ప్రకాష్ దర్శకుడిగా వ్యవహరించిన ఈ ఈ సిరీస్‌లో మొత్తం ఏడు ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. . రిలయన్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ , రోహిత్‌ శెట్టి పిక్చర్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ వెబ్ సిరీస్‌ లో అజయ్‌ దేవ్‌గణ్‌ (సింగం), అక్షయ్‌ కుమార్‌ (సూర్యవంశీ), రణ్‌వీర్‌ సింగ్‌ (సింబా) స్పెషల్‌ రోల్స్‌లో కనిపించనుండడం విశేషం. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సిరీస్‌పై అంచనాలు పెంచేసింది.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

ప్రమోషన్లలో సిద్ధార్థ్, శిల్పాశెట్టి..

ఇండియన్‌ పోలీస్ ఫోర్స్‌ వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
సతీసమేత హనుమంతుడు..! తెలంగాణలో ఈ ప్రత్యేక ఆలయం ఎక్కడుందో తెలుసా?
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..?
ఇంట్లో నిమ్మ చెట్టు పెంచుకోవచ్చా..?
కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన తండ్రి!
కూతుర్ని ఇంటి నుంచి గెంటేసి.. గుణపాఠం నేర్పిన తండ్రి!
Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది
Video: ఫ్యాన్‌ రిపేర్‌ చేయడానికి వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడింది
ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం..
ఆ ఆలయం, రథ వీధిలో వివాహానికి ముందు తరువాత ఫోటోషూట్‌పై నిషేధం..
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్‌! ఫలితాల తేదీ
ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. మూల్యాంకనం ముగిసిందోచ్‌! ఫలితాల తేదీ
ఇకపై CSK కెప్టెన్‌గా ధోని! మార్పు ఎందుకంటే..?
ఇకపై CSK కెప్టెన్‌గా ధోని! మార్పు ఎందుకంటే..?
ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
ఉప్పల్‌ స్టేడియానికి వెళ్లే క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త
జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్ట్..
జగన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. చేబ్రోలు కిరణ్ అరెస్ట్..
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటున్నరేణు ప్రశంసల వర్షం
ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అంటున్నరేణు ప్రశంసల వర్షం