The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలో ‘ది కేరళ స్టోరీ’.. అదా శర్మ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. పెద్దగా గ్యాప్‌ కూడా తీసుకోవు. అయితే కొన్ని సినిమాలు నెలల తరబడినా ఓటీటీలోకి రావడం లేదు. అందులో హార్ట్‌ ఎటాక్‌ బ్యూటీ అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ కూడా ఒకటి. మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ మూవీ లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం

The Kerala Story OTT: ఎట్టకేలకు ఓటీటీలో 'ది కేరళ స్టోరీ'.. అదా శర్మ కాంట్రవర్సీ మూవీ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
The Kerala Story Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 06, 2024 | 8:46 PM

సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తాయి. పెద్దగా గ్యాప్‌ కూడా తీసుకోవు. అయితే కొన్ని సినిమాలు నెలల తరబడినా ఓటీటీలోకి రావడం లేదు. అందులో హార్ట్‌ ఎటాక్‌ బ్యూటీ అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ కూడా ఒకటి. మే 5న విడుదలైన ఈ కాంట్రవర్సీ మూవీ లాంగ్‌ రన్‌లో ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.ఈ సినిమా బడ్జెట్‌ కేవలం రూ. 35 కోట్లే కావడం గమనార్హం. థియేటర్లలో విడుదలకు ముందే ది కేరళ స్టోరీ వార్తల్లో నిలిచింది. కేరళలో వివాదాస్పదమైన లవ్‌ జిహాద్‌ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కడమే దీనికి కారణం. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ది కేరళ స్టోరీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రదర్శించుకుండా నిషేధం విధించారు. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాల్లో పన్ను మినహాయింపు ప్రకటించారు. బీజేపీ నాయకులు ఈ సినిమాకు మద్దతుగా నిలిస్తే, ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఇలా వివాదాలతోనే వార్తల్లో నిలిచే ఓవరాల్ గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ది కేరళ స్టోరీ. ఇలా భారీ వసూళ్లు రాబట్టి, అందరి నోళ్లలో నానిని ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్‌ కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అదాశర్మ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం కుదరలేదు. అప్పుడప్పుడూ దీనిపై వార్తలు వస్తోన్నా ఏది వాస్తవ రూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు ది కేరళ స్టోరీ ఓటీటీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జీ5 ది కేరళ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. సంక్రాంతి 2024 నుంచి ది కేరళ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. జనవరి 12 లేదా 12వ తేదీ నుంచి అదాశర్మ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుందని తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ది కేరళ స్టోరీ అందుబాటులో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై అటు ఓటీటీ సంస్థ కానీ, చిత్ర నిర్మాతలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ది కేరళ స్టోరీ సినిమాలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి

సంక్రాంతి పండగ కానుకగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?