Captain Miller: ‘శివన్న చిరునవ్వులో పునీత్ కనిపిస్తున్నాడు’.. కన్నడ సూపర్‌ స్టార్‌పై హీరో ధనుష్‌ ప్రశంసలు

మొదటి సినిమాలో రజనీకాంత్‌తో నటిస్తే, రెండో సినిమాలో మాజీ అల్లుడు ధనుష్‌తో కలిసి నటిస్తున్నాడు శివన్న. మరికొద్ది రోజుల్లో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు ధనుష్ శివన్నపై ప్రశంసలు కురిపించారు.

Captain Miller: 'శివన్న చిరునవ్వులో పునీత్ కనిపిస్తున్నాడు'.. కన్నడ సూపర్‌ స్టార్‌పై హీరో ధనుష్‌ ప్రశంసలు
Dhanush, Shiva Rajkumar
Follow us
Basha Shek

|

Updated on: Jan 05, 2024 | 6:41 AM

‘ జైలర్ ’ సినిమాతో తమిళ సినీ ప్రియులకు బాగా చేరువైపోయాడు కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌. ఇప్పుడు కెప్టెన్‌ మిల్లర్‌ సినిమాతో మరోసారి కోలీవుడ్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. మొదటి సినిమాలో రజనీకాంత్‌తో నటిస్తే, రెండో సినిమాలో మాజీ అల్లుడు ధనుష్‌తో కలిసి నటిస్తున్నాడు శివన్న. మరికొద్ది రోజుల్లో కెప్టెన్‌ మిల్లర్‌ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు ధనుష్ శివన్నపై ప్రశంసలు కురిపించారు. శివరాజ్‌కుమార్‌ను సార్ అని సంబోధించిన ధనుష్‌ ‘ శివన్నా.. మీరు నడిచే స్టైల్ అద్భుతం, జైలర్‌ సినిమాతో మీరు తమిళ సినీ ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. మీ చిరునవ్వులో మీ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్‌, మీ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ ఇద్దరూ కనిపిస్తారు. తండ్రి సంపాదించిన పేరు ప్రఖ్యాతలను రెట్టింపు చేయడంతో మీరు బెస్ట్‌ ఉదాహరణ. ఈ కార్యక్రమానికి నా పిల్లలు కూడా వచ్చారు. వారు మీ నుండి నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు ధనుష్‌.

కెప్టెన్‌ మిల్లర్‌ దర్శకుడు అరుణ్ మట్టేశ్వరన్ గురించి మాట్లాడుతూ.. ‘ దర్శకుడు నన్ను కలుసుకుని కేవలం 15 నిమిషాలకే కథ చెప్పారు. భారీ స్థాయిలో నిర్మించే సినిమా అవుతుందా? నేను అడిగాను. అతను తల ఊపాడు. ఇప్పుడు సినిమా చూసినప్పుడు తను చెప్పినట్లే చేశాడని అనిపిస్తుంది. అరుణ్‌ని చూడగానే వెట్రిమారన్‌ గుర్తొస్తాడు. సినిమాను అద్భుతంగా తీశారు. కథనం, సినిమా చివరి ముప్పై నిమిషాలు అద్భుతంగా ఉంటాయి. అందరూ చూసి ఎంజాయ్ చేయాలనేదే నా కోరిక’ అన్నాడు ధనుష్. ధనుష్‌తో పాటు శివరాజ్ కుమార్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కృష్ణ, జాన్ కాకేన్ తదితరులు నటించిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం జనవరి 12న పలు భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తయింది. సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ‘కెప్టెన్ మిల్లర్’ సినిమా ఎంత ఉంటుందనే సమాచారం వచ్చింది. ఈ సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. కొత్త ఏడాది కీలక నియమాల మార్పు
పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. కొత్త ఏడాది కీలక నియమాల మార్పు
ఈ కండల వీరుడిని గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హీరో
ఈ కండల వీరుడిని గుర్తు పట్టారా? ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ హీరో
మజ్జిగలో ఇది ఒక్కస్పూన్‌ కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు..కొవ్వు
మజ్జిగలో ఇది ఒక్కస్పూన్‌ కలుపుకొని తాగితే బరువు తగ్గుతారు..కొవ్వు
పీఎం కిసాన్‌ స్కీమ్‌ 19వ విడత డబ్బులు వచ్చేది అప్పుడేనా..?
పీఎం కిసాన్‌ స్కీమ్‌ 19వ విడత డబ్బులు వచ్చేది అప్పుడేనా..?
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...
ఆంధ్రా లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇక్కడ చూడండి...
ప్రధాని ఆఫీస్‌లో వంట వారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా?
ప్రధాని ఆఫీస్‌లో వంట వారు, డ్రైవర్లు, క్లర్క్‌ల జీతం ఎంతో తెలుసా?
Post Office Scheme: రూ. 5000 పెట్టుబడిపై చేతికి రూ.8 లక్షలు!
Post Office Scheme: రూ. 5000 పెట్టుబడిపై చేతికి రూ.8 లక్షలు!
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే స్టార్ ఫ్రూట్.. ఇంకా ఎన్నో లాభాలు!
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే..
పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే..
టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
టాలీవుడ్‌లో జెండా పాతడానికి రెడీ అవుతున్న అందాల భామ
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
ఏయ్‌ బ్రో అని పిలువు.. లేకపోతేనా.! చెర్రీ కి బాలయ్య వార్నింగ్.!
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
2025 పై టాలీవుడ్ స్టార్ హీరోస్ దండయాత్ర.! అన్ని పెద్ద సినిమాలే..
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
ఫిష్ వెంక‌ట్‌ భావోద్వేగం.! ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆర్థిక‌ సాయంపై వీడియో.
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
సంధ్యా థియేటర్‌ ఘటనలో పుష్పా ప్రొడ్యూసర్స్‌కు బిగ్ రిలీఫ్.!
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
వామ్మో.. ఏంటి లచ్చ పెట్టినా కానీ రామ్ చరణ్‌ హుడీ రాదా.?
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మకు అరుదైన చర్మ వ్యాధి.! వీడియో
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
టాలీవుడ్‌పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్.! వారే కారణమా.?
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
క్యాన్సర్ నుంచి బటయటపడ్డ శివన్న.. కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో.!
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
దిల్ రాజు కోసం తగ్గిన చరణ్‌.! |తొక్కిసలాట ఘటనలో బన్నీ తప్పేం ఉంది
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..