Amala Paul: అమ్మ కాబోతున్న అమలా పాల్‌.. కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పిన అందాల తార

2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి కాపురంలో విభేదాలు తలెత్తడంతో 2017లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత అమల, జగత్ దేశాయ్ కొంతకాలం ప్రేమించుకున్నారు.  గతేడాది నవంబర్ లో కొచ్చి వేదికగా  వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

Amala Paul: అమ్మ కాబోతున్న అమలా పాల్‌.. కొత్త ఏడాదిలో శుభవార్త చెప్పిన అందాల తార
Actress Amala Paul Family
Follow us
Basha Shek

|

Updated on: Jan 04, 2024 | 7:40 AM

కొత్త ఏడాదిలో ప్రముఖ నటి అమలా పాల్ శుభవార్త చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రియుడితో పెళ్లిపీటలెక్కిన ఈ అందాల తార త్వరలో తల్లికాబోతున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంది అమలా పాల్. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను షేర్‌ చేసిందామె. వీటికి ‘మేమిద్దరం ముగ్గురం కాబోతున్నాం’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలా పాల్‌ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అమలా పాల్ గతేడాది నవంబర్‌లో కొచ్చి వేదికగా ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. ఇది ఆమెకు రెండవ వివాహం. ఇప్పుడు ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. అమలా పాల్, జగత్ దేశాయ్ తమ రొమాంటిక్‌ ఫొటోస్‌ను ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ ఈ శుభవార్తను పంచుకున్నారు. 2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో అమలా పాల్ ప్రేమలో పడింది. ఆ తర్వాత వీరిద్దరూ 2014లో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి కాపురంలో విభేదాలు తలెత్తడంతో 2017లో పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత అమల, జగత్ దేశాయ్ కొంతకాలం ప్రేమించుకున్నారు.  గతేడాది నవంబర్ లో కొచ్చి వేదికగా  వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

కేరళకు చెందిన అమలా పాల్ దక్షిణాది భాషా చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. 2009లో సినీ రంగ ప్రవేశం చేసిన అమల కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో నాగచైతన్య బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. లవ్‌ ఫెయిల్యూర్‌, ఇద్దరమ్మాయిలతో, నాయక్‌, జెండాపై కపిరాజు,పిట్ట కథలు వంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఈ మధ్యన వెబ్‌ సిరీసుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోందీ అందాల తార. తెలుగులో ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ కుడి ఎడమైతేకు ఓటీటీలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఇద్దరం ముగ్గురం కాబోతున్నాం..

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

అమలా పాల్ పెళ్లి వీడియో..

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

భర్తతో అమలా పాల్ రొమాంటిక్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.