Hanuman Movie: ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. మెగా ఉత్సవ్ కోసం ఆ స్టార్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ.. ఈ చిత్రంపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఫ్యామిలీ అడియన్స్, యూత్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతుంది.

Hanuman Movie: 'హనుమాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. మెగా ఉత్సవ్ కోసం ఆ స్టార్ హీరో..
Hanuman
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 04, 2024 | 7:26 AM

ఇప్పుడు టాలీవుడ్ అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘హనుమాన్’ ఒకటి. ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన మోస్ట్ అవైటెడ్ సినిమా ఇది. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కొద్దిరోజుల క్రితమే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ.. ఈ చిత్రంపై మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం ఫ్యామిలీ అడియన్స్, యూత్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తు్న్నారు మేకర్స్. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

‘హనుమాన్’ మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్‏ను జనవరి 7న ఆదివారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్‏లో నిర్వహించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేస్తూ.. ‘హనుమాన్’ సినిమా నుంచి తేజ సజ్జా పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మెగా ఉత్సవ్ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. లేటేస్ట్ సమాచారం ప్రకారం వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారట. తాజాగా మూవీ రిలీజ్ చేసిన పోస్టర్ లో చిరు వస్తున్నారని నేరుగా చెప్పకపోయినా.. “మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్” అని తెలియజేసి హింట్ ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా సినీ వర్గాల్లో అయితే చిరంజీవి అతిథిగా రాబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

ఇక కొద్దిరోజుల నుంచే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే.. ఈ సినిమా చిరు కూడా భాగం కాబోతున్నారట. ఈ మూవీలో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని అంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, దీపక్ శెట్టి, సముద్రఖని, వెన్నెల కిషోర్ కీలకపాత్రలలో నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్