Vijay Deverakonda – Rashmika : మొదలైన రష్మిక, విజయ్ పెళ్లి ఏర్పాట్లు.. ఇద్దరూ ఏం చదువుకున్నారో తెలుసా.. ?
మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం మొదలయ్యాయి.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరు.. ఇప్పుడు ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో వీరిద్దరి వివాహం జరగనుందని టాక్. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. అలాగే ఈ వేడుకకు అంతర్జాతీయ సెక్యూరిటీ ఉండనుందని సమాచారం. ఇప్పటికే వీరి పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. మార్చి 4, 2026 బుధవారం సాయంత్రం 7:00 గంటల నుండి హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..
దీంతో ఇప్పుడు విజయ్, రష్మిక పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరిద్దరు ఏం చదువుకున్నారు అనే విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. సినిమాల్లోకి రాకముందు రష్మిక విద్యపై ఎక్కువగా దృష్టి పెట్టిందని చాలా మందికి తెలియదు. ఆమె బెంగళూరులో సైకాలజీ, జర్నలిజం గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. ఆమె తన కళాశాల రోజుల్లోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. ఎన్నో అందాల పోటీలలో పాల్గొంది. 2016లో కిరిక్ పార్టీ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఛలో మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. గీతా గోవిందం మూవీతో మరో విజయాన్ని అందుకుంది. తక్కువ సమయంలో పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..
విజయ్ విషయానికి వస్తే.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని సాధారణ కుర్రాడు ఇప్పుడు హీరోగా తనదైన ముద్ర వేశాడు. అర్జున్ రెడ్డి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విజయ్.. ఆ త్రవాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మే 9, 1989న జన్మించిన విజయ్ దేవరకొండ 2011లో నువిలా చిత్రంతో తెరంగేట్రం చేశారు. తన బాల్యంలో ఎక్కువ భాగం తన కుటుంబానికి దూరంగా గడిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో 10వ తరగతి వరకు బోర్డింగ్ స్కూల్ అయిన శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నాడు. బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..
