AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uday Kiran : ఉదయ్ కిరణ్ సినిమా ప్లాప్ కావడానికి ఆయనే కారణం.. డైరెక్టర్ కామెంట్స్..

దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఉదయ్ కిరణ్ తో తనకున్న అనుబంధం.. అలాగే అతడు నటించిన శ్రీరామ్ చిత్రం అంచనాలను అందుకోలేకపోవడానికి గల కారణాలను వివరించారు. ఆ సినిమా ప్లాప్ కావడానికి గల విషయాలు.. తర్వాత తన సినీప్రయాణం గురించి ప్రస్తావించారు.

Uday Kiran : ఉదయ్ కిరణ్ సినిమా ప్లాప్ కావడానికి ఆయనే కారణం.. డైరెక్టర్ కామెంట్స్..
Vn Aditya, Uday Kiran
Rajitha Chanti
|

Updated on: Feb 21, 2026 | 12:50 PM

Share

దర్శకుడు వి.ఎన్.ఆదిత్య ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చిత్రం శ్రీరామ్ విజయం సాధించకపోవడానికి గల కారణాలను, దివంగత నటుడు ఉదయ్ కిరణ్ మరణంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. శ్రీరామ్ ఆశించినంత విజయం సాధించకపోవడానికి ప్రధానంగా మార్కెటింగ్ లోపాలను, నిర్మాత నిర్ణయాలే కారణమని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. దెబ్బకు 200 సాంగ్స్ వచ్చాయి.. ఫోక్ సింగర్స్..

శ్రీరామ్ ఒక యాక్షన్ సినిమా అయినప్పటికీ, మొహబ్బతే వంటి రొమాంటిక్ తరహా పోస్టర్లను విడుదల చేయడం వల్ల ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. ఉదయ్ కిరణ్ అప్పటికి క్లాస్ ఇమేజ్ ఉన్న నటుడని, ఆయనను యాక్షన్ హీరోగా అంగీకరించడం కష్టమని ముందుగానే హెచ్చరించినప్పటికీ, నిర్మాత తన మాటలను పట్టించుకోలేదని ఆదిత్య తెలిపారు. సినిమాకు దిల్ వంటి యాక్షన్ టైటిల్ పెట్టమని సూచించినప్పటికీ, నిర్మాత అంగీకరించలేదన్నారు. విడుదలైన మొదటి వారానికే థియేటర్లను మార్చమని నిర్మాత లేఖ ఇవ్వడం కూడా చిత్రానికి నష్టం కలిగించిందని ఆదిత్య అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రభాస్ అడగ్గానే 30 లక్షలు ఇచ్చాడు.. తాతలు 3 వేల ఎకరాలు దానం చేశారు.. డైరెక్టర్ కామెంట్స్..

మనసంతా నువ్వే సినిమాకు నిర్మాత ఎం.ఎస్.రాజు ప్రమోషన్ ను పూర్తిగా తన బాధ్యతగా తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు. కానీ శ్రీరామ్ మూవీ విషయంలో మాత్రం విడుదల కాకముందే భారీ లాభాలు పొందడంతో, ప్రమోషన్ కు ఖర్చు చేయడం తన లాభాన్ని తగ్గిస్తుందని భావించి ఆసక్తి చూపలేదన్నారు. ఇది శ్రీరామ్ చిత్రానికి పెద్ద లోపంగా నిలిచిందని ఆదిత్య వివరించారు. ఉదయ్ కిరణ్ మరణంపై వి.ఎన్.ఆదిత్య తన తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నందుకు తనకు బాధ కంటే కోపమే ఎక్కువని అన్నారు. ఆత్మహత్య ధోరణులను తాను పూర్తిగా వ్యతిరేకిస్తానని, జీవితం కంటే ఏదీ గొప్పది కాదని ఆయన స్పష్టం చేశారు. ఉదయ్ కిరణ్ తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయాన్ని అందుకున్నప్పటికీ, తన జీవితాన్ని ప్రేమించలేకపోవడం ఆదిత్యను తీవ్రంగా కలచివేసింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

Follow Us