AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : చిరంజీవి, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. కెరీర్ ఫాంలో ఉండగానే పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషలలో వరుస హిట్స్ అందుకుంది. అలాగే కెరీర్ మొదట్లోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడు స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : చిరంజీవి, ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. కెరీర్ ఫాంలో ఉండగానే పెళ్లి.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
Sameera Reddy
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 11:45 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? తెలుగులో తోపు హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కోందట. నా చర్మపు రంగు, శరీరాకృతి కారణంగా నేను అభద్రతా భావానికి లోనయ్యాను అని పలు సందర్భాల్లో బయటపెట్టింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ సమీరా రెడ్డి. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని హీరోయిన్. ఇటీవల తన ఇన్ స్టాలో చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ అభద్రతా భావం గురించి రాసుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

తాను చిన్నప్పుడు అస్సలు ఆత్మవిశ్వాసం లేని పిల్లనని తెలిపింది. “నేను చిన్నప్పుడు ఆత్మవిశ్వాసం లేకుండా ఉండేదాన్ని. నా చర్మపు రంగు లేదా శరీరాకృతి గురించి అభద్రతాభావంతో ఉన్న నల్లని అమ్మాయిని పట్టుకుని, భవిష్యత్తులో తను ఎంత అద్భుతమైన వ్యక్తి అవుతుందో చెప్పి ఉంటే బాగుండేది. నాకు పిల్లలు పుట్టినప్పుడు, మొదట వారికి దయ, కరుణ నేర్పించాలని నేను నిశ్చయించుకున్నాను. అదే సమయంలో, తమ హద్దులను తామే నిర్ణయించుకోవడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం కూడా వారు అర్థం చేసుకోవాలని నేను భావించాను. నేటి ప్రపంచంలో ఈ రెండింటినీ సమతుల్యం చేసుకోవడం చాలా పెద్ద సవాలు. నేను ఆ బాధను అనుభవిస్తూ పెరిగాను. ఇది ఒక జ్ఞాపిక. మీరు ప్రేమించే వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. వారు పిల్లలైనా, పెద్దలైనా, మీరు వారిని రక్షించాలి, వారికి ధైర్యం ఇవ్వాలి. వారు చెప్పేది వినడానికి సిద్ధంగా ఉండాలి. నా గురించి నాకున్న పాత అభిప్రాయాలను మార్చుకోవడానికి నేను ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను. చిన్నతనంలో మన మనసుల్లో నాటుకుపోయిన ఎన్నో విషయాలను అధిగమించడానికి మనమందరం ప్రయత్నిస్తున్నామని నేను ఖచ్చితంగా చెప్పగలను” అంటూ రాసుకొచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

సమీరా రెడ్డి.. తెలుగులో ఎన్టీఆర్ జోడిగా నరసింహుడు, అశోక్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవా మూవీలో కనిపించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ఫిట్నెస్, వెయిట్ లాస్ విషయాలు పంచుకుంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us