AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ప్రస్తుతం ఓటీటీలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దూసుకుపోతుంది. 131 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సంచలనం సృష్టిస్తుంది. దృశ్యం సినిమా కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్ ఉన్న సినిమా ఇది. ఇటీవల విడుదలైన వెంటనే టాప్ 10 ఓటీటీలోకి జాబితాలోకి చేరింది. ఎలాంటి ఆర్బాటం లేకుండా జీవించే ఓ సాధారణ వ్యక్తి హంతకుడిగా ఎలా మారాడు అన్నది సినిమా.

Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 12:30 PM

Share
భారతీయ చిత్రసీమలో మర్డర్ మిస్టరీ చిత్రాల గురించి మాట్లాడితే ఎన్నో చిత్రాలు గుర్తుకు వస్తాయి. అలాగే ఆద్యంతం ఊహించని మలుపు, సస్పెన్స్ తో సాగే సినిమాలు ఉంటే ఠక్కున గుర్తొచ్చే పేరు దృశ్యం. మలయాళం, హిందీ, తెలుగు భాషలలో ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ సస్పెన్స్ విషయంలో అన్ని రికార్డులను బద్దలుకొట్టిన ఒక చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. సంజయ్ మిశ్రా, నీనా గుప్తాల చిత్రం 'వధ్ 2'. ఎలాంటి ఆర్భాటం లేదా భారీ బడ్జెట్ లేకుండా కూడా ఒక కళాఖండాన్ని నిర్మించవచ్చని నిరూపించింది.

1 / 5
ఈ సినిమా విడుదలైనప్పటి నుండి ఓటీటీ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, ఒక సాధారణ వ్యక్తి ఎప్పుడు, ఎందుకు హంతకుడిగా మారతాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఈ చిత్రం మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే చివరి వరకు సీటు అంచున కూర్చోబెడుతుంది. మొదటి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా కథలో మునిగిపోతారు.

2 / 5
కథ విషయానికి వస్తే.. శంభునాథ్ మిశ్రా (సంజయ్ మిశ్రా) మధ్యప్రదేశ్‌లోని శివపురి జైలులో పనిచేసే ఒక పోలీస్. అతని భార్య చనిపోయింది. అతని కొడుకు విదేశాల్లో నివసిస్తున్నాడు. శంభునాథ్ తన కొడుకు చదువు కోసం పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ అప్పు తీర్చే స్థోమత అతనికి లేదు. శంభునాథ్ ఇప్పుడు తన అప్పు తీర్చడానికి అదనపు ఆదాయం కోసం జైలు లోపల కూరగాయలు పండించి బయట అమ్ముతాడు.

3 / 5
 ఇంతలో, మంజు సింగ్ (నీనా గుప్తా) అదే జైలులో రెండు హత్యల కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోంది. ఈ గందరగోళం మధ్యలోకి ఎమ్మెల్యే సోదరుడు కేశవ్ జైలుకు రావడంతో, కథ మొత్తం మలుపు తీసుకుంటుంది. కేశవ్ నిర్భయంగా ఉంటూ తోటి ఖైదీలను నిరంతరం కొడుతూ ఉంటాడు. ఒక రోజు కేశవ్ తన బ్యారక్స్‌లోంచి అదృశ్యం కావడంతో అసలు కథ మొదలవుతుంది.

4 / 5
 ఈ చిత్రంలోని సస్పెన్స్ 'దృశ్యం'ను మించిపోయింది. క్లైమాక్స్ మిమ్మల్ని నివ్వెరపరుస్తుంది. సోషల్ మీడియాలో ప్రజలు "వధ్ 2"ను ఒక మాస్టర్‌పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇది నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సినిమాకు IMDbలో 10కి 7.5 రేటింగ్ ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఎంజాయ్ చేసేవారు ఈ సినిమాను తప్పక చూడొచ్చు.

5 / 5
Follow Us