AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunil : ఉదయ్ కిరణ్‏తో ఆ సినిమా చేయకపోతే సునీల్ అనేవాడు ఉండేవాడు కాదు.. సునీల్ ఎమోషనల్..

నటుడు సునీల్ గురించి తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం భాషలలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల ఓ మూవీ వేడుకలో తన సినీ ప్రస్థానం గురించి మాట్లాడారు. తన కెరీర్ ప్రారంభంలో దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య (ఆది బాబు) ఉదయ్ కిరణ్ సినిమాలో తనను ప్రధాన పాత్రకు ఎంచుకుని, తెరపై ఎక్కువ నిడివి ఉండే పాత్రను ఇచ్చి తనపై నమ్మకం పెంచారని సునీల్ గుర్తుచేసుకున్నారు.

Sunil : ఉదయ్ కిరణ్‏తో ఆ సినిమా చేయకపోతే సునీల్ అనేవాడు ఉండేవాడు కాదు.. సునీల్ ఎమోషనల్..
Sunil, Uday Kiran
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 1:08 PM

Share

నటుడు సునీల్ ఓ సినిమా ప్రచారంలో భాగంగా తన సినీ ప్రస్థానం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశను గుర్తుచేసుకుంటూ, తాను నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్ వంటి చిత్రాలలో పాత్రలు చేస్తున్న సమయంలో, దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య (ఆది బాబు) తనను మనసంతా నువ్వే సినిమాలో నమ్మకంతో ఎంచుకున్నారని తెలిపారు. 45 రోజుల పాటు తన పాత్ర నిడివి ఉండేలా చూసి, తెరపై తనను ఇంత లెంగ్త్‌లో చూస్తారని నమ్మకం కల్పించిన వ్యక్తి వీ.ఎన్. ఆదిత్య అని అన్నారు. ఈ సందర్భాన్ని గుర్తుచేస్తూ, వైజాగ్ లో ఆ సినిమా షూటింగ్ చేసిన రోజులు, కలర్ ఫోటో లాగే ఎంజాయ్ చేస్తూ చేసిన ఆ చిత్రానికి 19 సంవత్సరాలు పూర్తవుతాయని సునీల్ వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : ఆమెను అలా చూసి తట్టుకోలేకపోయాను.. సౌందర్య గురించి ప్రేమ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

ఉదయ్ కిరణ్, సునీల్ కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, హోలీ వంటి చిత్రాల్లో నటించారు. నువ్వు నేను షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నాడు సునీల్. ఆ సినిమాలో ఓ రన్నింగ్ రేస్ సమయంలో నిజమైన రన్నర్ లను తీసుకొచ్చాడని.. వాళ్లతో కలిసి ఉదయ్ కిరణ్ పరిగెత్తాలని.. వాళ్లతో నిజంగానే పరిగెత్తి వచ్చాడు ఉదయ్. అంత స్పీడ్ ఎలా వచ్చావని అడిగితే.. తాను చిన్నప్పుడు బస్సుల వెంట పరుగెత్తి అలవాటు అయిపోయిందని చెప్పినట్లు గుర్తుచేసుకున్నాడు. ఎప్పుడూ సరదాగా ఉండే వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జీర్ణించుకోలేకపోయానని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 62 ఏళ్లలో 2500కు పైగా సినిమాలు.. మహేష్ బాబు సినిమాతో ఫేమస్.. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.. ?

హీరోగా తాను సినిమాలు చేస్తున్నప్పుడు, “మీ దగ్గర ఉన్నది ఇంకెక్కడా కనపడట్లేదు” అని తనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చేవారని ఫేస్‌బుక్‌లో ఒకరు పెట్టిన కామెంట్‌ను సునీల్ గుర్తుచేసుకున్నారు. తన పక్కన సప్తగిరి కామెడీ చేస్తుంటే, తాను ఐడియాలు ఇచ్చేవాడినని, తన నైపుణ్యం కామెడీలో ఉందని, సరైన అవకాశం వస్తే అది ఇంకా దూసుకుపోతుందని ఆ రోజున ఫీల్ అయ్యానని సునీల్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us