AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upcoming Movies: ఈ వారం అదిరిపోయే ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలు, భారీ బడ్జెట్ ప్రాజెక్టులు విజయాన్ని అందుకుంటున్నాయి. ఈవారం సైతం పలు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. అలాగే మరికొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి.మరీ ఈసారి వచ్చే మూవీస్ ఏంటో తెలుసుకుందాం.

Upcoming Movies: ఈ వారం అదిరిపోయే ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో, ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
April Movies
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2026 | 2:37 PM

Share

వేసవి కాలం మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కొత్త సినిమాల కోసం అటు అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ మెప్పించేందుకు సిద్ధమయ్యాయి. ఇంట్లోనే కూర్చుని కుటుంబంతో కలిసి ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ఈసారి పలు సినిమాలకు, వెబ్ సిరీస్ లకు మరింత రెస్పాన్స్ వస్తుంది. అందుకే ఈ వారం ఓటీటీలో, థియేటర్లలో వచ్చే సినిమాల గురించి తెలుసుకుందామా. విభిన్నమైన ప్రేమకథలు, మాస్ యాక్షన్ డ్రామాలు, హారర్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రానున్నాయి. మరీ ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల గురించి తెలుసుకుందామా.

డెకాయిట్..

విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు అడివి శేష్. ఇప్పుడు డెకాయిట్ అంటూ అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈమూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

ఎల్ఐకే..

ఎల్ఐకే.. లవ్ ఇన్సురెన్స్ కంపెనీ.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ మూవీని ఏప్రిల్ 1న0 రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఇందులో ఎస్జే సూర్య, యోగిబాబు, గౌరీ కిషన్, శారా కీలకపాత్రలు పోషిస్తున్నారు.

పళ్లిచట్టంబి..

మలయాళీ నటుడు టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న సినిమా పళ్లి చట్టంబి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ డీజో జోస్ ఆంటోనీ తెరకెక్కిస్తున్నారు. మలయాళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు.

ఓటీటీటీలో విడుదలయ్యే సినిమాలు..

జియో హాట్ స్టార్..

ది టెస్టమెంట్స్ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 08 ది క్లీనింగ్ లేడీ (వెబ్ సిరీస్) ఏప్రిల్ 08 థాయ్ కిళవి తమిళం ఏప్రిల్ 10

అమెజాన్ ప్రైమ్..

నిప్పన్ సంగోకు.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 05 ది బాయ్స్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 08 ఓ రోమియో.. హిందీ.. ఏప్రిల్ 10

నెట్ ఫ్లిక్స్..

బీప్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 08 అన్ టోల్డ్.. చెస్ మేట్స్.. వెబ్ సిరీస్.. ఏప్రిల్ 08 తూ యాన్ మైన్.. హిందీ.. ఏప్రిల్ 10

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma : ప్రపంచంలోని అన్నిటికంటే ఆ పాటే గొప్ప సాంగ్.. బతుకునే మార్చే పాట ఇది.. రామ్ గోపాల్ వర్మ..

ఎక్కువ మంది చదివినవి : Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. ఆ హీరో మాట్లాడే తీరు సూపర్ ఉంటుంది.. హీరోయిన్ ఆమని..

Follow Us