AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Berlin Web Series: ఓటీటీలోకి వచ్చేసిన బెర్లిన్‌.. తెలుగులోనూ మనీ హైస్ట్‌ సిరీస్‌ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?

మనీ హైస్ట్‌ సిరీస్‌లు చూసే వారికి బెర్లిన్‌ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడిదే పాత్రను పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తూ మరొక సిరీస్‌ను రూపొందించారు మేకర్స్‌. అసలు బెర్లిన్‌ గతమేంటి? మనీ హైస్ట్‌ కన్నా ముందు అతను చేసిన దోపిడీలు, దొంగతనాలేంటి? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు.

Berlin Web Series: ఓటీటీలోకి వచ్చేసిన బెర్లిన్‌.. తెలుగులోనూ మనీ హైస్ట్‌ సిరీస్‌ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
Berlin Web Series
Basha Shek
|

Updated on: Jan 02, 2024 | 6:27 PM

Share

హాలీవుడ్ సినిమాలు చూసే వారికి మనీ హైస్ట్ సిరీస్‌ మూవీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్‌ను విశేషంగా ఆకట్టుకున్న ఈ స్పానిష్ వెబ్‌ సిరీస్‌లకు తెలుగులోనూ చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అందుకు తగ్గట్టే మనీ హైస్ట్‌ సిరీస్‌లో వచ్చిన సిరీస్‌లన్నీ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఈ సూపర్‌ హిట్ సిరీస్‌లో మరొకటి అందుబాటులోకి వచ్చింది. మనీ హైస్ట్‌ సిరీస్‌లు చూసే వారికి బెర్లిన్‌ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇప్పుడిదే పాత్రను పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తూ మరొక సిరీస్‌ను రూపొందించారు మేకర్స్‌. అసలు బెర్లిన్‌ గతమేంటి? మనీ హైస్ట్‌ కన్నా ముందు అతను చేసిన దోపిడీలు, దొంగతనాలేంటి? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. బెర్లిన్‌ పాత్రలో పెడ్రో అలోన్సో కనిపించగా, సమంత సిక్వోరోస్‌, ట్రిస్టన్‌ ఉల్లోవా, మిచెల్‌ జెన్నర్‌, బెగోనా వర్గాస్‌, జూలియో పెనా ఫెర్నోండోజ్‌, జోయెల్‌ శాంఛెజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో బెర్లిన్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

దాదాపు ఏడు గంటల పాటు సాగేబెర్లిన్‌ వెబ్‌ సిరీస్‌ లో మొత్తం 8 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. సిరీస్‌ కథ విషయానికి వస్తే.. పారిస్‌ ఆక్షన్‌ హౌస్‌లో ఉన్న 44 మిలియన్‌ యూరోల విలువైన ఆభరణాలను దోపిడీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తాడు హీరో బెర్లిన్‌ (పెడ్రో అలోన్సో). ఇందుకోసం దామియన్‌, కైలా, కామెరూన్‌, రాయ్‌, బ్రూస్‌లను సహాయకులుగా ఎంచుకుంటాడు. వీరందరూ ఒక్కో అంశంలో ఆరితేరి ఉంటారు. మరి బెర్లిన్‌ తన ప్రణాళికలను ఎలా అమలుపరిచాడు. ఆభరణాలను ఎలా దోపిడీ చేశాడు? కమిలి (సమంత సిక్వోరోస్‌) ప్రేమలో పడిన తర్వాత బెర్లిన్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయన్నది తెలుసుకోవాలంటే బెర్లిన్‌ వెబ్ సిరీస్‌ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

తెలుగు ఆడియోతోనూ స్ట్రీమింగ్..

బెర్లిన్ వెబ్ సిరీస్ తెలుగు ట్రైలర్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్