AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి రిజల్యూషన్స్ ఇవే

ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠీకి 2023 సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పుకోవచ్చు. గతేడాది నవంబర్‌ 1న మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ అందా తార. ఇటలీ వేదికగా అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. టుస్కానీలో జరిగిన ఈ మెగా గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు పాల్గొని సందడి చేశారు.

Lavanya Tripathi: కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన మెగా కోడలు.. లావణ్య త్రిపాఠి రిజల్యూషన్స్ ఇవే
Varun Tej, Lavanya Tripathi
Basha Shek
|

Updated on: Jan 01, 2024 | 9:58 PM

Share

ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠీకి 2023 సంవత్సరం ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పుకోవచ్చు. గతేడాది నవంబర్‌ 1న మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిందీ అందా తార. ఇటలీ వేదికగా అట్టహాసంగా వీరి వివాహం జరిగింది. టుస్కానీలో జరిగిన ఈ మెగా గ్రాండ్‌ వెడ్డింగ్‌లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు పాల్గొని సందడి చేశారు. అంతకు ముందు జూన్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారీ లవ్లీ కపుల్‌. తాజాగా కొత్త ఏడాదికి గ్రాండ్‌గా స్వాగతం పలికింది లావణ్య. సోషల్‌ మీడియా వేదికగా అందరికీ న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పింది. అలాగే 2024లో తన రిజల్యూషన్స్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కొత్త సంవత్సరంలో మరింత మానవత్వంతో మెలగాలని, తనపై తనకు మరింత ప్రేమ పెరగాలని, సోషల్‌ మీడియాకు చాలా తక్కువగా సమయం కేటాయించాలని, ఎక్కువ సమయం ప్రకృతితోనే మమేకం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది లావణ్య. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. అభిమానులు, నెటిజన్లు లావణ్యకు న్యూ ఇయర్‌ విషెస్‌ చెబుతున్నారు. అలాగే ఆమె రిజల్యూషన్స్‌ కూడా నెరవేరాలని ఆకాంక్షిస్తున్నారు.

2012లో అందాల రాక్షసి చిత్రం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ఆతర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్‌, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, అర్జున్‌ సురవరం, ఏ1 ఎక్స్‌ప్రెస్‌, చావు కబురు చల్లగా వంటి హిట్‌ సినిమాలతో తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైంది. ఇక వరుణతో కలిసి మిస్టర్‌, అంతరిక్షం సినిమాల్లో నటించిందీ అందాల తార. ఈ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇక చివరిగా పులి మేక అనే వెబ్‌ సిరీస్‌ లో నటించింది లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో లావణ్య నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో లావణ్య, వరుణ్ తేజ్..

క్రిస్మస్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ..

లావణ్య త్రిపాఠి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
'జైలర్ ' విలన్‌కు తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చికిత్స.. ఏమైందంటే?
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
CAT 2025లో 12మందికి 100 పర్సంటైల్.. తెలుగు రాష్ట్రాల్లో నో టాపర్
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఎక్కడంటే
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..