AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Payal Rajput:’నీ ప్రేమను మిస్‌ అవుతున్నా.. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి’ ఇయర్ ఎండింగ్‌లో పాయల్ ఎమోషనల్

ఆసక్తికరమైన కథ, కథనాలు, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, బీజీఎమ్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌.. ఇలా అన్నీ అంశాలు పుష్కలంతో ఉండడంతో మంగళవారం మూవీకి బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడీ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోనూ పాయల్ రాజ్‌ పుత్ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మంగళవారం సక్సెస్‌తో పాయల్‌ రాజ్‌పుత్‌కు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి.

Payal Rajput:'నీ ప్రేమను మిస్‌ అవుతున్నా.. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా ఉండాలి' ఇయర్ ఎండింగ్‌లో  పాయల్ ఎమోషనల్
Actress Payal Rajput
Basha Shek
|

Updated on: Dec 31, 2023 | 8:32 PM

Share

మంగళవారం సినిమాతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కింది టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌ పుత్‌. ఆర్‌ ఎక్స్‌ 100తో బ్లాక్ బస్టర్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అన్ని పరాజయాలే పలకరించాయి. రవితేజ, వెంకటేశ్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించినా దురదృష్టమే వెక్కిరించింది. తమిళ్‌, కన్నడ సినిమాల్లో నటించినా విజయం దక్కలేదు. దీంతో తనకు మొదటి హిట్‌ అందించిన అజయ్‌ భూపతి డైరెక్షన్‌లోనే మంగళ వారం సినిమా చేసింది. నవంబర్‌ 17న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆసక్తికరమైన కథ, కథనాలు, గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే, బీజీఎమ్‌, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌.. ఇలా అన్నీ అంశాలు పుష్కలంతో ఉండడంతో మంగళవారం మూవీకి బాగానే కలెక్షన్లు వచ్చాయి. ఇప్పుడీ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. డిజిటల్‌ స్ట్రీమింగ్‌లోనూ పాయల్ రాజ్‌ పుత్ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. మంగళవారం సక్సెస్‌తో పాయల్‌ రాజ్‌పుత్‌కు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. అయితే ఇలాంటి సంతోష సమయంలో పాయల్‌ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె ఎంతో ప్రేమగా పెంచుకుంటోన్న పెట్‌ డాగ్‌ క్యాండీ హఠాత్తుగా చనిపోయింది.

ఎంతో ప్రేమగా చూసుకుంటోన్న పెట్‌ డాగ్‌ ఉన్నట్లుండి కన్నుమూయడంతో పాయల్‌ ఎమోషనలైంది. తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంది. పెట్‌ డాగ్‌తో కలిసున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన పాయల్‌ ‘ ‘నీ హగ్స్, నీ ప్రేమని మిస్ అవుతున్నా. నువ్వు ఇంకా నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తోంది. నిన్ను ఎంతగానో ప్రేమించాను. ప్రేమ అంటే ఏంటో తెలిసేలా చేశావ్. ఇకపై నా జీవితాంతం నిన్ను మిస్ అవుతూనే ఉంటాను.. .. నువ్వెక్కడున్నా ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలి.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం తెలుగులో కిరాతక అనే సినిమాలో నటిస్తోంది పాయల్‌. అలాగే తమిళంలో గోల్‌మాల్‌, ఏంజెల్‌ అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

పాయల్ రాజ్ పుత్ ఇన్ స్టాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్

ఓటీటీలో మంగళవారం సినిమాకు సూపర్ రెస్పాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జింక వీపుపై కోతి స్వారీ చేస్తున్న అద్భుతమైన దృశ్యం..!
జింక వీపుపై కోతి స్వారీ చేస్తున్న అద్భుతమైన దృశ్యం..!
అంతరిక్షంలోకి ఇస్రో 'అన్వేషణ'.. 2026లో తొలి ప్రయోగానికి మొదలైన
అంతరిక్షంలోకి ఇస్రో 'అన్వేషణ'.. 2026లో తొలి ప్రయోగానికి మొదలైన
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ