Mohammed Shami: అన్నయ్య బాటలోనే తమ్ముడు.. రంజీ ట్రోఫీలో ఆడనున్న మహ్మద్ షమీ సోదరుడు
ఈ పద్దెనిమిది మంది సభ్యుల జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ చోటు దక్కించుకున్నాడు. 2021లో ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కైఫ్.. తొలిసారి రంజీ జట్టుకు ఎంపిక కావడం విశేషం. మహ్మద్ షమీలాగే మహ్మద్ కైఫ్ కూడా ఫాస్ట్ బౌలర్. లీస్ట్ ఏ క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతను ఇప్పటికే 12 వికెట్లు తీశాడు
జనవరి 5 నుండి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ 2024 కోసం బెంగాల్ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యుల జట్టుకు పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి/ప్లేయర్ మనోజ్ తివారీ నాయకత్వం వహించనున్నారు. తివారీకి ఇదే చివరి టోర్నీ కావడం గమనార్హం. ఈ రంజీ ట్రోఫీతో క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని మనోజ్ తివారీ నిర్ణయించుకున్నాడు. విశేషమేమిటంటే.. ఈ పద్దెనిమిది మంది సభ్యుల జట్టులో మహ్మద్ షమీ సోదరుడు మహ్మద్ కైఫ్ చోటు దక్కించుకున్నాడు. 2021లో ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా దేశవాళీ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కైఫ్.. తొలిసారి రంజీ జట్టుకు ఎంపిక కావడం విశేషం. మహ్మద్ షమీలాగే మహ్మద్ కైఫ్ కూడా ఫాస్ట్ బౌలర్. లీస్ట్ ఏ క్రికెట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అతను ఇప్పటికే 12 వికెట్లు తీశాడు. ఇప్పుడు రంజీ టోర్నీ ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తానని కైఫ్ ధీమాతో చెబుతున్నాడు. ఈ ఏడాది రంజీ టోర్నీకి కర్ణాటక జట్టును కూడా ప్రకటించారు. ఈ 16 మంది సభ్యుల జట్టుకు మయాంక్ అగర్వాల్ నాయకత్వం వహిస్తాడు. యువ బ్యాటర్ నికిన్ జోస్ వైస్ కెప్టెన్‌గా కనిపించనున్నాడు. అలాగే యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సుజయ్ ఈసారి జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.
మహ్మద్ షమీ సోదరుడు..
Congratulations to my brother on your Vijay Hazare Trophy debut. We have waited for this moment. You are one step closer to the ultimate dream. Keep working hard.#TeamIndia #mshami11 pic.twitter.com/kqp2xGAk1F
ఇవి కూడా చదవండి— 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) February 27, 2021
రంజీ ట్రోఫీకి బెంగాల్ జట్టు:
మనోజ్ తివారీ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, సుదీప్ ఘరామి, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సౌరవ్ పాల్ (వికెట్ కీపర్), శ్రేయాన్ష్ ఘోష్, రంజోత్ సింగ్ ఖైరా, సుభమ్ ఛటర్జీ, ఆకాశ్ దీప్, ఇషాన్ పోరెల్, ప్రదీప్ ప్రమాణిక్ , కరణ్ లాల్, కౌశిక్ మైతి, మొహమ్మద్ కైఫ్, అంకిత్ మిశ్రా, ప్రయాస్ రే బర్మన్, సూరజ్ సింధు జైస్వాల్, సుమన్ దాస్.
కర్ణాటక జట్టు:
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), ఆర్. సమర్థ్, దేవదత్ పడిక్కల్, నికిన్ జోస్ (వైస్ కెప్టెన్), మనీష్ పాండే, శుభాంగ్ హెగ్డే, శరత్ శ్రీనివాస్, వియకుమార్ వైశాక్, వి. కౌశిక్, విద్వాత్ కవీరప్ప, కె. శశికుమార్, సుజయ్ సాతేరి, డి. నిశ్చల్, ఎం. వెంకటేష్, కిషన్ బెదెరే, రోహిత్ కుమార్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..