IND vs AUS: ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్‌ ప్లేయర్‌.. ఆస్పత్రికి తరలింపు

భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్‌ స్నేహా రాణా తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే గ్రౌండ్‌ నుంచి బయటకు తీసుకెళ్లారు.

IND vs AUS: ఫీల్డింగ్‌ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా స్టార్‌ ప్లేయర్‌.. ఆస్పత్రికి తరలింపు
Indian Women's Cricket Team
Follow us

|

Updated on: Dec 30, 2023 | 8:43 PM

భారత మహిళల క్రికెట్ జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్‌ స్నేహా రాణా తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే గ్రౌండ్‌ నుంచి బయటకు తీసుకెళ్లారు. స్నేహ స్థానంలో కంకషన్ ప్లేయర్‌గా హర్లీన్ డియోల్‌ను మైదానంలోకి పంపారు. రానాను స్కానింగ్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాణా గాయపడి మైదానం నుంచి బయటకు వెళ్లింది. అయితే కొంత సమయం తర్వాత ఆమె మైదానంలోకి తిరిగి వచ్చి బౌలింగ్ కూడా చేసింది. కానీ తలనొప్పి ఎక్కువ కావడంతో మళ్లీ గ్రౌండ్‌ నుంచి బయటకు వచ్చేసింది. స్నేహ రాణా స్థానంలో హర్లీన్‌ ఫీల్డ్‌ లోకి వచ్చింది’ అని బీసీసీఐ తెలిపింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 25వ ఓవర్‌లో శ్రేయాంక పాటిల్‌ బౌలింగ్‌కు వచ్చింది. క్రీజులో ఉన్న బెత్ మూనీ బంతిని గాలిలోకి ఆడగా.. పూజా వస్త్రాకర్‌, స్నేహా రాణా ఇద్దరూ క్యాచ్‌ పట్టేందుకు పరిగెత్తారు. సమన్వయ లోపంతో ఇద్దరూ ఒకరినొకరు ఢీకొన్నారు. ఈ ఘటనలో స్నేహా రానాకు తీవ్ర గాయలయ్యాయి. దీంతో వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో స్నేహా రాణాను బయటకు తీసుకెళ్లారు. అయితే 33వ ఓవర్‌లో రానా మళ్లీ ఫీల్డ్‌లోకి దిగింది. తన కోటా 10 ఓవర్లు బౌల్ చేసి 59 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకుంది. అయితే ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి రావడంతో స్నేహారాణాను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఆస్ట్రేలియా  భారీ స్కోరు..

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 63 పరుగుల విలువైన ఇన్నింగ్స్ ఆడింది. ఆమెతో పాటు అలిస్సా పెర్రీ 47 బంతుల్లో 50 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరును 250కి మించి తీసుకెళ్లడంలో లోయర్ ఆర్డర్ కీలక పాత్ర పోషించింది. అన్నాబెల్ సదర్లాండ్ 23, జార్జియా వేర్‌హామ్ 22, ఎలానా కింగ్ 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. భారత్ తరఫున దీప్తి శర్మ ఐదు వికెట్లు పడగొట్టింది. పూజా వస్త్రాకర్, పాటిల్, రానాలకు తలో వికెట్ దక్కింది.

ఇవి కూడా చదవండి

బీసీసీఐ అప్డేట్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత ఒలింపిక్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
భారత ఒలింపిక్ బృందానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుభాకాంక్షలు
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
మీరూ సోలో ట్రావెల్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
టాలీవుడ్‌లో తోపులు ఈ ఇద్దరూ.. ఎవరో గుర్తుపట్టారా..?
చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్
చిన్న సినిమాలే కదా అనుకోకండి.. కోట్లు కురిపించాయి ఈ మూవీస్
నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?
నెలవంకలాంటి ఒత్తైన నల్లని కనుబొమ్మలు మీ సొంతం కావాలా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
మహేశ్, ప్రభాస్‌లతో సినిమాలు చేసిన ఈ చిన్నారిని గుర్తు పట్టారా?
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
కోనసీమలో కూలీల కొరత.. కలకత్తా నుంచి రప్పించుకుంటున్న రైతన్నలు
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పిల్లలకు స్కూల్లో పిచ్చిపిచ్చిగా హెయిర్ కట్ చేసిన టీచర్.. తర్వాత
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..
పాన్‌కార్డు పేరుతో భారీ స్కామ్.. చెక్ చేసుకోండి లేకుంటే..