AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించిన కింగ్‌ కోహ్లీ.. 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా..

సౌతాఫ్రికా బౌలర్ల దాడిని ఎదుర్కొంటూ అడ్డుగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు సాధించాడు. . ఈ పరుగులతో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

Virat Kohli: సఫారీల గడ్డపై చరిత్ర సృష్టించిన కింగ్‌ కోహ్లీ.. 146 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా..
Virat Kohli
Basha Shek
|

Updated on: Dec 30, 2023 | 9:40 PM

Share

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా బ్యాటర్లు సమష్టిగా విఫలం కావడంతో భారత్‌కు ఘోర ఓటమి తప్పలేదు. అయితే సౌతాఫ్రికా బౌలర్ల దాడిని ఎదుర్కొంటూ అడ్డుగా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 38 పరుగులు చేసిన కింగ్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు సాధించాడు. . ఈ పరుగులతో విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో విరాట్ కోహ్లీ మొత్తం 114 పరుగులు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. అలాగే సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. దక్షిణాఫ్రికాలో 38 మ్యాచ్‌లు ఆడిన సచిన్ 6 సెంచరీలతో మొత్తం 1724 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును కింగ్ కోహ్లీ బద్దలు కొట్టాడు.

విరాట్ కోహ్లీ దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు మొత్తం 29 మ్యాచ్‌లు ఆడాడు. ఈసారి 5 సెంచరీలతో 1750 పరుగులు సేకరించాడు. దీంతో సఫారీల గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా కోహ్లీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ మ్యాచ్‌లో మొత్తం 114 పరుగులతో విరాట్ కోహ్లీ 2023లో 2000+ పరుగులు పూర్తి చేశాడు. దీంతో ఒక్క ఏడాదిలో 2 వేలకు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్‌ నిలిచాడు. గతంలో ఈ రికార్డు శ్రీలంక కుమార సంగక్కర పేరిట ఉండేది. సంగక్కర ఒక సంవత్సరంలో 6 సార్లు 2 వేలకు పైగా పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు కింగ్ కోహ్లీ 7వ సారి ఏడాదిలో 2000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో క్రికెట్ చరిత్రలో ఏడాది వ్యవధిలో 7 సార్లు 2000+ పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 146 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో ఈ ఫీట్‌ నమోదు చేసిన ఏకైక ఆటగాడు విరాట్‌ కోహ్లినే కావడం విశేషం.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా గడ్డపై విరాట్ కోహ్లీ స్కోర్లు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఏపీలో పింఛన్లు పొందుతున్నవారికి అలర్ట్.. డైరెక్ట్‌గా అకౌంట్లోకి..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఆ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది.. పాములను ఎలా కంట్రోల్ చేశాడో..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఎండుతున్న పంటలు.. ఇంకిపోయిన భూగర్భ జలాలు..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆర్టీసీ బస్సుల్లో వారికి ఫ్రీ జర్నీ.. ఏపీఎస్‌ఆర్టీసీ శుభవార్త..
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
ఆ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రాణం పెట్టాడు.. కానీ
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..