A Ranjith Cinema OTT : ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్ బస్టర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

షాంత్ సత్తు తెరకెక్కించిన ఎ రంజిత్‌ సినిమా గతంలో తెలుగులో వచ్చిన ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌ను పోలి ఉంటుంది. ఇందులో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమితా ప్రమోద్, జువెల్ మేరీ, హన్నా రెజి కోశి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆసక్తికరంగా సాగే స్ర్కీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో ఎ రంజిత్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది.

A Ranjith Cinema OTT : ఓటీటీలోకి వచ్చేసిన మరో మలయాళ బ్లాక్ బస్టర్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
A Ranjith Cinema
Follow us
Basha Shek

|

Updated on: Dec 29, 2023 | 8:41 PM

మరో మలయాళ బ్లాక్‌ బస్టర్‌  సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌ జానర్‌కు చెందిన ఒక నయా మూవీ శుక్రవారం (డిసెంబర్‌ 29) అర్ధరాత్రి నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ లోకి వచ్చేసింది. అదే ఎ రంజిత్‌ సినిమా. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మలయాళ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. నిషాంత్ సత్తు తెరకెక్కించిన ఎ రంజిత్‌ సినిమా గతంలో తెలుగులో వచ్చిన ఎ ఫిల్మ్‌ బై అరవింద్‌ను పోలి ఉంటుంది. ఇందులో ఆసిఫ్ అలీ, సైజు కురుప్, అన్సన్ పాల్, నమితా ప్రమోద్, జువెల్ మేరీ, హన్నా రెజి కోశి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆసక్తికరంగా సాగే స్ర్కీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో ఎ రంజిత్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే థియేటర్లలో రిలీజై నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధ రాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసిందీ సైకలాజికల్‌ థ్రిల్లర్‌. అయితే ప్రస్తుతానికి ఈ మూవీ కేవలం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో స్ట్రీమింగ్‌ కు రానుంది.

ఎ రంజిత్‌ సినిమా స్టోరీ కూడా ఏ ఫిల్మ్‌ బై అరవింద్‌ కథనే పోలి ఉంది. పెద్ద ఫిల్మ్‌ మేకర్‌ కావాలని రంజిత్‌ (ఆసిఫ్ అలీ) కలలు కంటుంటాడు. ఇందుకోసం రెండు సినిమా సబ్జెక్టులు రాసుకోవాలనుకుంటాడు. ఒకటేమో ఊహజనిత సంఘటనలతో కూడిన స్టోరీ, మరొకటి నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకోవాలని భావిస్తాడు. అయితే తాను రాసుకున్న ఊహా జనిత సంఘటనలే తన నిజ జీవితంలో జరుగుతుంటాయి. ఓ క్రిమినల్ కేసులో కూడా ఇరుక్కుంటాడు రంజిత్‌. మరోవైపు ఇతనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతుంటారు. మరి వీటినుంచి రంజిత్ ఎలా బయటపడ్డాడన్నదే ఈ సినిమా స్టోరీ. థ్రిల్లర్‌, హారర్‌ జానర్‌ సినిమాలు చూసే వారికి ఏ రంజిత్‌ సినిమా మంచి ఛాయిస్‌ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..!
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
ప్రభాస్ సినిమాకు నో చెప్పిన ఆ క్రేజీ హీరోయిన్! కారణమేంటో తెలుసా?
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
దుబాయ్‌లో డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
మళ్ళీ ప్లేగు వ్యాధి వ్యాప్తి సహా నోస్ట్రాడమస్ అంచనాలు ఏమిటంటే..
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
రైతులకు సులువుగా రుణాలు.. రూ.1000 కోట్లతో రుణ హామీ పథకం
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
లీకు రాయుళ్ల పైత్యం.. స్కూల్‌ పిల్లల SA 1 మ్యాథ్స్‌ పేపర్ లీక్!
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
నవ్వు ఆపుకోలేరు..! పెళ్లి మండపంలోనే మరదలితో సరసాలాడిన వరుడు..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
వామ్మో ఈ పాడు ఎలుకులు ఎంత పని చేశాయి..
ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..!ఏం జరిగిదంటే
ఒక్క ముద్దు.. ఆమెకు మృత్యువు ముంచుకొచ్చేలా చేసింది..!ఏం జరిగిదంటే
బిడ్డ పుట్టిందని ఆటో డ్రైవర్ల‌కు ఊహించని గిఫ్ట్
బిడ్డ పుట్టిందని ఆటో డ్రైవర్ల‌కు ఊహించని గిఫ్ట్