Salaar: కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి.. సలార్‌ సెట్‌లో క్రికెట్‌.. శ్రుతి బ్యాటింగ్‌ హైలెట్‌.. వీడియో

సలార్ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలవడంతో చిత్ర యూనిట్‌ అంతా సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రభాస్‌ మూవీలో ఆద్యగా అదరగొట్టిన శ్రుతి హాసన్‌ అభిమానులకు మరో సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. సలార్‌ షూటింగ్ సెట్‌లో చోటు చేసుకున్న కొన్ని మధుర క్షణాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె క్రికెట్‌ ఆడుతున్న వీడియో కూడా ఉండడం విశేషం

Salaar: కొడితే కొట్టాలిరా సిక్స్‌ కొట్టాలి.. సలార్‌ సెట్‌లో క్రికెట్‌.. శ్రుతి బ్యాటింగ్‌ హైలెట్‌.. వీడియో
Salaar Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 28, 2023 | 8:35 PM

ప్రభాస్‌ సలార్‌ దెబ్బకు బాక్సాఫీస్‌ రికార్డులు ఒక్కొక్కటి బద్దలవుతున్నాయి. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ వసూళ్ల వేట కొనసాగిస్తోంది. ఇప్పటివరకు రూ. 500 కోట్లు కలెక్ట్‌ చేసిన సలార్‌ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డు వసూళ్లు సాధిస్తుందంటున్నారు నిపుణులు. సలార్ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలవడంతో చిత్ర యూనిట్‌ అంతా సంబరాల్లో మునిగితేలుతోంది. ప్రభాస్‌ మూవీలో ఆద్యగా అదరగొట్టిన శ్రుతి హాసన్‌ అభిమానులకు మరో సర్‌ ప్రైజ్‌ ఇచ్చింది. సలార్‌ షూటింగ్ సెట్‌లో చోటు చేసుకున్న కొన్ని మధుర క్షణాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంది. ఇందులో ఆమె క్రికెట్‌ ఆడుతున్న వీడియో కూడా ఉండడం విశేషం. అలాగే ప్రభాస్‌, పృథ్వీరాజ్‌, ప్రశాంత్‌లతో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. ‘సలార్ మధుర క్షణాలు.. ఈ అద్భుతమైన వ్యక్తులతో కలిసి వర్క్‌ చేయడాన్ని నేను బాగా ఎంజాయ్‌ చేశాను. సలార్‌ షూట్‌లో మేమందరం చాలా సరదాగా గడిపాం. ప్రభాస్‌ మాకోసం ఇష్టమైన వంటకాలను తీసుకొచ్చాడు. మమ్మల్ని ఎంతో కేరింగ్‌ గా చూసుకున్నాడు. ఇక షూట్‌ మధ్యలో ప్రశాంత్ సార్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడుతూ సరదాగా గడిపాడు’.

ఇవి కూడా చదవండి

సలార్‌ సినిమాలో నటించడం చాలా బాగుంది. మంచి వాళ్లకు జీవితంలో మంచే జరగడం నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఈ సినిమాతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఈ మెజిస్టిక్‌ ప్రపంచంలో నాకు కూడా స్థానం కల్పించినందుకు ప్రశాంత్‌ సార్‌కు, హోంబలే ఫిల్మ్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని శ్రుతి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమెషేర్‌ చేసిన ఫొటోలు, వీడియోలు తెగ వైరలవుతున్నాయి. కాగా సలార్ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి కాకుండానే రూ. 500 కోట్ల మార్క్ అందుకోవడం విశేషం. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సలార్‌ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రభాస్‌ స్నేహితుడిగా నటించాడు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా మెరిసింది. అలాగే జగపతిబాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సలార్ సినిమాను నిర్మించింది.

సలార్ సెట్ లో క్రికెట్ మ్యాచ్.. వీడియో

శ్రుతి హాసన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గాల్లోకి దూసుకుపోయిన ఫ్లైట్..రన్‌వేపై దాని టైర్! తర్వత జరిగిందిదే
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
గీటుకు నిలిచేదే బంగారం హాల్‌మార్క్ ఉన్నా నకిలీదేనా.. వీడియో వైరల్
కావాలనే చేస్తున్నారు.. నేను రాజీపడే మనిషిని కాను..
కావాలనే చేస్తున్నారు.. నేను రాజీపడే మనిషిని కాను..