AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karimnagar’s Most Wanted: ఓటీటీలోకి వచ్చేసిన ‘కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ వెబ్‌ సిరీస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో పక్కా తెలుగు వెబ్‌ సిరీస్‌ వచ్చేసింది. అదే కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఈ సిరీస్‌ స్పెషాలిటీ ఏంటంటే.. పేరుకు తగ్గట్టుగా ఇందులో చాలామంది కరీంనగర్‌ ప్రాంతానికే చెందిన వారే నటించారు. షూటింగ్ కూడా మొత్తం తెలంగాణలోనే జరిగింది. తెలంగాణ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం.

Karimnagar's Most Wanted: ఓటీటీలోకి వచ్చేసిన 'కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌' వెబ్‌ సిరీస్‌.. ఎక్కడ చూడొచ్చంటే?
'karimnagar's Most Wanted Web series
Basha Shek
|

Updated on: Dec 27, 2023 | 7:45 PM

Share

సైతాన్‌, అతిథి వధువు, ధూత, వ్యూహం.. ఇలా టాలీవుడ్‌లోనూ వెబ్‌ సిరీస్‌లు జోరందుకుంటున్నాయి. ఓటీటీ ఆడియెన్స్‌ నుంచి మంచి స్పందన వస్తుండడంతో స్టార్‌ హీరోలు, డైరెక్టర్లు వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి చూపిస్తు్న్నారు. ఈనేపథ్యంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో పక్కా తెలుగు వెబ్‌ సిరీస్‌ వచ్చేసింది. అదే కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌. ఈ సిరీస్‌ స్పెషాలిటీ ఏంటంటే.. పేరుకు తగ్గట్టుగా ఇందులో చాలామంది కరీంనగర్‌ ప్రాంతానికే చెందిన వారే నటించారు. షూటింగ్ కూడా మొత్తం తెలంగాణలోనే జరిగింది. తెలంగాణ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం. కరీంనగర్స్‌ మోస్ట్‌ వాంటెడ్‌ సిరీస్‌లో సాయి, అమన్ సూరేపల్లి, సాసా, బాలాజీలు కీలక పాత్రలు పోషించారు. బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించారు. టీజర్‌, సాంగ్స్‌, ట్రైలర్‌తోనే ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా టాలీవుడ్‌ స్టార్ సింగర్‌ రాహుల్‌ సిప్లీ గంజ్‌ ఆలపించిన ‘కరీంనగర్ వాలే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. ఇలా ఎన్నో విశేషాలతో తెరకెక్కిన కరీంనగర్‌ మోస్ట్ వాంటెడ్‌ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ పక్కా లోకల్‌ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

సస్పెన్స్, డ్రామా, థ్రిల్లింగ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఇలా అన్నీ అంశాలు పొలిటికల్‌ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ వెబ్‌ సిరీస్‌లో సస్పెన్స్, డ్రామా, థ్రిల్లింగ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ అన్నీ అంశాలున్నాయి. బలగం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ రచయిత రమేశ్‌ ఎలిగేటి ఈ సిరీస్‌కు కథ, కథనం, సంభాషణలు అందించడం విశేషం. అనంత్ శ్రీకర్‌ సంగీతం అందించాడు. ఇక కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ వెబ్‌ సిరీస్‌ కథ విషయానికి వస్తే.. ఓ ఐదుగురు యువకుల చుట్టూ తిరుగుతుది. ఐదు కోట్ల బ్యాంక్‌ స్కాంలో అరెస్ట్‌ అయి జైలుకు వెళతారు. అయితే ఎలాగోలా బయటికొచ్చి అందరితో గొడవులు పెట్టుకుంటూ రౌడీయిజం చేస్తారు. కోట్లు సంపాదించి రాజకీయాల్లోకి అడుగపెడతారు. మరి ఆ ఐదుగురు యువకుల జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే కరీంనగర్ మోస్ట్ వాంటెడ్‌ వెబ్‌ సిరీస్‌ కథాంశం.

ఇవి కూడా చదవండి

‘కరీంనగర్‌ మోస్ట్‌ వాంటెడ్‌’ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్..

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌