Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Suma: మంచి మనసు చాటుకున్న స్టార్‌ యాంకర్‌ సుమ.. క్రిస్మస్‌ కానుకగా రూ.5 లక్షల విరాళం

సుమ కనకాల.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. వేదిక ఏదైనా, సందర్భమేదైనా తన మాటల ప్రవాహంతో మాయ చేసి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం ఈ యాంకరమ్మ స్పెషల్‌. అందుకే సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌, సక్సెస్ ఫంక్షన్లు.. ఇలా సినిమాలకు సంబంధించి ఏ కార్యక్రమమైనా సుమక్క ఉండాల్సిందే.

Anchor Suma: మంచి మనసు చాటుకున్న స్టార్‌ యాంకర్‌ సుమ.. క్రిస్మస్‌ కానుకగా రూ.5 లక్షల విరాళం
Anchor Suma Kanakala
Follow us
Basha Shek

|

Updated on: Dec 25, 2023 | 9:33 PM

సుమ కనకాల.. ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. వేదిక ఏదైనా, సందర్భమేదైనా తన మాటల ప్రవాహంతో మాయ చేసి ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం ఈ యాంకరమ్మ స్పెషల్‌. అందుకే సినిమా ఈవెంట్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌, సక్సెస్ ఫంక్షన్లు.. ఇలా సినిమాలకు సంబంధించి ఏ కార్యక్రమమైనా సుమక్క ఉండాల్సిందే. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు చేసుకున్న సుమ ఆ మధ్యన జయమ్మ పంచాయతీ సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ పెద్దగా ఆడలేకపోయింది. ఇప్పుడు తన వారసుడిగా రోషన్ కనకాలను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. బబుల్‌ గమ్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నాడు సుమ కుమారుడు రోషన్‌. ఈ సినిమాలో మానస చౌదరి హీరోయిన్‌గా నటించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న బబుల్ గమ్‌ డిసెంబర్ 29న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. సినిమాల సంగతి పక్కన పెడితే.. సామాజిక సేవలోనూ తన వంతు పాత్ర పోషిస్తోంది యాంకర్‌ సుమ.

అయితే సుమ యాంకరింగ్‌తో పాటు సమాజసేవలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు.’ ఫెస్టివల్ ఫర్ జాయ్’ స్వచ్ఛంద సంస్థ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మహిళలు, పిల్లలకు అవసరమైన తోడ్పాటును అందిస్తోంది. కరోనా కష్టకాలంలోనూ సహాయక కార్యక్రమాలు చేపట్టింది. అలాగే ఏటా క్రిస్‌మస్‌ సందర్భంగా బహమతులు అందజేస్తోంది. అలా ఈ ఏడాది క్రిస్‌మస్ సందర్భంగా ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్‌కు రూ.5 లక్షల చెక్‌ను అందజేసింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) సహకారంతో ఫిల్మ్ జర్నలిస్ట్స్ ఇన్సూరెన్స్ ఫండ్‌కు ఈ సాయం అందజేసినట్లు సుమ తెలిపింది. ఇక NATS విరాళాన్ని సుమ క‌న‌కాలతెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర కుమార్ సహా ఇతర అసోసియేషన్ సభ్యులకు అందజే శారు.

ఇవి కూడా చదవండి

ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులకు..

గతంలోనూ పలు సేవా కార్యక్రమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..