Animal OTT: ఓటీటీలోకి రణ్‌బీర్, రష్మికల ‘యానిమల్‌’.. అదనపు సీన్లతో కలిపి స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?

కేవలం హిందీలోనే కాదు తెలుగులోనూ రణ్‌ బీర్‌ కపూర్‌ సినిమాకు ఆడియెన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్‌ పరంగా కొన్ని విమర్శలున్నా ఇప్పటివరకు ఏకంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది యానిమల్‌ మూవీ. థియేటర్లలో అదరగొడుతోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Animal OTT: ఓటీటీలోకి రణ్‌బీర్, రష్మికల 'యానిమల్‌'.. అదనపు సీన్లతో కలిపి స్ట్రీమింగ్‌.. ఎప్పుడు, ఎక్కడంటే?
Animal Movie
Follow us

|

Updated on: Dec 24, 2023 | 4:45 PM

బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌ రణ్‌ బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన పవర్‌ ప్యాక్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ యానిమల్‌. సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. త్రిప్తి దిమ్రి మరో కీ రోల్‌ పోషించింది. బాబీ డియోల్‌ విలన్‌ గా మెప్పించగా, రణ్‌ బీర్‌ తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ ఒదిగిపోయాడు. డిసెంబర్‌ 1న థియేటర్లలో రిలీజైన యానిమల్‌ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టింది. రిలీజై మూడు వారాలు పూర్తైనా కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయి. కేవలం హిందీలోనే కాదు తెలుగులోనూ రణ్‌ బీర్‌ కపూర్‌ సినిమాకు ఆడియెన్స్‌ బ్రహ్మరథం పడుతున్నారు. కంటెంట్‌ పరంగా కొన్ని విమర్శలున్నా ఇప్పటివరకు ఏకంగా రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు చేసింది యానిమల్‌ మూవీ. థియేటర్లలో అదరగొడుతోన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో యానిమల్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సంక్రాంతి పండగ కానుకగా యానిమల్‌ మూవీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో వస్తుందని తెలుస్తోంది. ఒక వేళ ఈ తేదీ కుదరకపోతే గణ తంత్ర దినోత్సవానికి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముంది.  త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

ఇదిలా ఉంటే యానిమల్‌ మూవీ థియేటర్‌ వెర్షనే సుమారు 3 గంటలకు పైగా ఉంది. అయితే ఓటీటీ వెర్షన్‌లో మరికొన్ని అదనపు సీన్లు జత చేయనున్నట్లు తెలుస్తోంది. ‘నేను ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ వెర్షన్‍ను ఎడిట్ చేస్తున్నాను. ఇందులో కొన్ని అదనపు షాట్స్ ఉంటాయి. నా దగ్గర 3 గంటల 30 నిమిషాల వెర్షన్ ఉంది. కానీ ఒత్తిడి వల్ల 8-9 నిమిషాలు తగ్గించాను. నెట్‍ఫ్లిక్స్ వెర్షన్ కోసం ఆ అదనపు ఫుటేజీని ఉపయోగిస్తున్నాను’ అని డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, మురాద్ ఖేతానీ, కృషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

సంక్రాంతికి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.