Salaar OTT Rights: దిమ్మతిరిగే రేట్‌కు ఓటీటీ రైట్స్.! ఆకాశమంత ఎత్తుకు ప్రభాస్..

Salaar OTT Rights: దిమ్మతిరిగే రేట్‌కు ఓటీటీ రైట్స్.! ఆకాశమంత ఎత్తుకు ప్రభాస్..

Anil kumar poka

|

Updated on: Dec 24, 2023 | 10:09 AM

సలార్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు సలార్ సినిమాకు 150కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్.

సలార్ సినిమా ఎట్టకేలకు విడుదలైంది. ప్రేక్షకులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సలార్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలైన అన్ని ఏరియాల్లో అభిమానులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టికెట్ బుకింగ్స్ తోనే రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు సలార్ సినిమాకు 150కోట్లకు పైగా వస్తాయని అంటున్నారు ఫ్యాన్స్. ఓవర్ ఆల్ గా ఈ సినిమా 1000కోట్లు దాటి వసూల్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఈ మూవీ ఓటీటీకి సంబంధించిన న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది

సలార్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ఇప్పటికే బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఇప్పుడు డిజిటల్ రైట్స్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సలార్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్.. అంటే శాటిలైట్.. డిజిటల్, ఆడియో.. ఈ మూడింటి హక్కులు దాదాపు 350కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఇందులో డిజిటల్ రైట్స్ వాటా కూడా ఎక్కువే ఉందంటున్నాయి సినీ వర్గాలు. ఇక సలార్ శాటిలైట్ రైట్స్ మాత్రం అన్ని భాషలకూ కలిపి స్టార్ టీవీ తీసుకుంది. అక్కడ ఉంది ప్రభాస్ ఆ మాత్రం ఉంటుంది అంటున్నారు ఫ్యాన్స్. ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 24, 2023 09:41 AM