Pallavi Prashanth: ‘అమర్‌ దీప్‌ ఊరికే ఉన్నా నేను వదలా’.. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌కు నటుడి స్ట్రాంగ్ వార్నింగ్

అమర్‌ దీప్‌ స్నేహితుడు, జానకి కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ లొల్ల పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఎవరు వదిలినా తాను మాత్రం దాడికి పాల్పడిన వారిని వదలనంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజి క మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Pallavi Prashanth: 'అమర్‌ దీప్‌ ఊరికే ఉన్నా నేను వదలా'.. పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌కు నటుడి స్ట్రాంగ్ వార్నింగ్
Amardeep, Pallavi Prashanth
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2023 | 6:28 PM

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బిగ్‌ బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌, రన్నరప్‌ అమర్ దీప్‌ అభిమానులు పరస్పరం గొడవ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లారు. అమర్‌ దీప్‌ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుతో పాటు గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను కూడా ధ్వంసం చేశారు కొందరు అభిమానులు. అలాగే ఆర్టీసీ బస్సులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే బెయిల్ లభించడంతో శనివారం సాయంత్ర రైతు బిడ్డ రిలీజ్ అయ్యాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు, అతని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో అమర్‌ దీప్‌ స్నేహితుడు, జానకి కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ లొల్ల పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. ఎవరు వదిలినా తాను మాత్రం దాడికి పాల్పడిన వారిని వదలనంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజి క మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే కోసం మేం సాయంత్రం 5 గంటలకు అన్నపూర్ణ స్టుడియోకి వెళ్లాం. అమర్, ప్రశాంత్ ఫైనల్ జాబితాలో ఉన్నారని తెలిసింది. రాత్రి 8.30కి షూటింగ్ అయిపోయింది. అమర్ రన్నర్, ప్రశాంత్ విన్నర్ అని తెలిసింది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు గట్రా ముగించుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యాం. ఎందుకైనా మంచిదని మా వెంట పది మంది బౌన్సర్స్‌ని పెట్టుకున్నాం. వాళ్లు బయటకు వెళ్లి వచ్చి.. మాకు షాకింగ్ విషయాలు చెప్పారు. బయట పరిస్థితి చాలా డేంజర్‌గా ఉంది. పెట్రోల్‌, రాళ్లు, కోడిగుడ్లు పట్టుకుని ఉన్నారని చెప్పారు. దీంతో నేను అమర్‌కు నచ్చజెప్పాను. ముఖం కనిపించకుండా దాచుకో అని అమర్‌కి చెప్పడానికి నాకే సిగ్గు అనిపించింది. అయితే వారు దాడి చేయడానికి వచ్చారు. మా కారు అద్దాలను పగల కొట్టారు. లోపల ఆడవాళ్లు, ముసలివాళ్లు ఉన్నారని చెప్పినా వినలేదు. కారులో ఉన్న లగేజ్ మొత్తం లాక్కెళ్లారు. అమర్ నాన్న గారు.. వెనుక కారులో ఉండి ఏడుస్తున్నారు. ఆయన పక్షవాతం వచ్చిన వ్యక్తి. మా కారు డాక్యుమెంట్స్‌ కూడా తీసుకెళ్లారు. పోలీసులు కేసులు పెట్టారు కదా.. నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి.. నేను వెళ్లి సాక్ష్యం చెప్తాను. ప్రశాంత్‌ని విన్నర్‌ని కాకుండా.. అమర్‌ని విజేతగా ఎంపిక చేస్తే అన్నపూర్ణ స్టుడియోను తగలబెట్టేస్తారా? ఎదుటోళ్లను ఇబ్బంది పెట్టే ఫ్యాన్స్ మాకు అవసరం లేదు’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు నరేశ్‌.

ఇవి కూడా చదవండి

అమర్ దీప్ దంపతులో నరేష్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.