Annapoorani OTT: అఫీషియల్‌.. ఓటీటీలోకి నయనతార కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?

సరిగ్గా నయనతార సినిమా రిలీజ్‌ సమయంలోనే తమిళ నాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో  అన్నపూరణి మూవీ జనాలకు పెద్దగా రీచ్‌ కాలేకపోయింది. మూవీ రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే అన్నపూరణి సినిమాపై వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హిందూ, బ్రాహ్మణ సంఘలు నయన తార సినిమాపై తీవ్రంగా మండి పడ్డాయి. సినిమాలోని సన్ని వేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయంటూ..

Annapoorani OTT: అఫీషియల్‌.. ఓటీటీలోకి నయనతార కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్‌.. ఎప్పుడంటే?
Nayanthara Annapoorani Movie
Follow us
Basha Shek

|

Updated on: Dec 24, 2023 | 8:33 PM

సౌతిండియా లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన లేటెస్ట్‌ సినిమా అన్న పూరణి. ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనేది మూవీ క్యాప్షన్‌. జవాన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నయన్ నటించిన సినిమా ఇదే. పైగా నయన తార సినిమా కెరీర్‌లో ఇది 75వ సినిమా. దీంతో రిలీజ్‌కు ముందే అన్న పూరణి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే డిసెంబర్‌ 1 న థియేటర్లలో విడుదలైన అన్నపూరణి యావరేజ్‌ టాక్‌తో సరిపెట్టుకుంది. సరిగ్గా నయనతార సినిమా రిలీజ్‌ సమయంలోనే తమిళ నాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో  అన్నపూరణి మూవీ జనాలకు పెద్దగా రీచ్‌ కాలేకపోయింది. మూవీ రిజల్ట్‌ సంగతి పక్కన పెడితే అన్నపూరణి సినిమాపై వివాదాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా హిందూ, బ్రాహ్మణ సంఘలు నయన తార సినిమాపై తీవ్రంగా మండి పడ్డాయి. సినిమాలోని సన్ని వేశాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయంటూ, మూవీపై నిషేధం విధించాలంటూ నిరసనలకు దిగారు. ఇలా వివాదాలతో వార్తల్లో నిలిచిన అన్నపూరణి సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజై నెల రోజులు పూర్తి కాకుండానే నయన్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వస్తుండడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ అన్న పూరణి సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. డిసెంబర్‌ 29 నుంచి లేడీ సూపర్‌ స్టార్‌ మూవీ ఓటీటీలోకి రానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ నయన తార సినిమా స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తమ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది నెట్‌ ఫ్లిక్స్‌.

నీలేశ్‌ కృష్ణ తెరకెక్కించిన అన్నపూరణి సినిమాలో జర్నీ ఫేమ్‌ జై, సత్యరాజ్‌, అచ్యుత్‌ కుమార్‌, కే ఎస్‌ రవి కుమార్‌, రెడిన్‌ కింగ్‌స్లే, రేణుకు, కార్తీక్‌ కుమార్‌, పూర్ణిమా రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్, నాట్ స్టూడియోస్, ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. థమన్‌ స్వరాలు అందించారు. ఇక ‘అన్నపూరణి’ సినిమా విషయానికొస్తే.. సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అమ్మాయి ఇండియాలో బెస్ట్‌ చెఫ్‌ అవ్వాలని కలలు కంటుంది. మాంసాహార వంటలకు సంబంధించిన రెస్టారెంట్‌ పెట్టుకోవాలనుకుంటుంది. ఇందుకోసం కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఛెఫ్‌ కోర్సులో జాయిన్‌ అవుతుంది. అదే సమయంలో ఒక రోడ్డు ప్రమాదంలో రుచిని తెలుసుకునే శక్తిని కోల్పోతుంది. మరి ఆ అమ్మాయి తన కలను ఎలా సాకారం చేసుకుందన్నదే అన్న పూరణి సినిమా కథ.

ఇవి కూడా చదవండి

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

అన్న పూరణి ప్రమోషన్లలో నయన తార..

தலைவி அன்னபூரணி @NayantharaU #Annapoorani#Nayanthara #Ladysuperstar #LadySuperstarNayanthara pic.twitter.com/Xytq1qmmxS

— Vignesh Sebastian (@VigneshSebasti3) December 3, 2023

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.