AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ రిలీజ్‌.. గ్రాండ్‌గా పార్టీ చేసుకున్న శివాజీ, భోలే.. వీడియో చూశారా?

ల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ రావడంలో ప్రముఖ సింగర్‌ భోలే షావలి కీలక పాత్ర పోషించాడు. అలాగే శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, అశ్విని శ్రీ, టేస్టీ తేజా, ప్రియాంక జైన్‌తో పాటు పలువురు ప్రముఖులు రైతు బిడ్డకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ జైలు నుంచి రిలీజ్‌ కావడంతో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ మళ్లీ కలుసుకున్నారు.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్‌ రిలీజ్‌..  గ్రాండ్‌గా పార్టీ చేసుకున్న శివాజీ, భోలే.. వీడియో చూశారా?
Bigg Boss 7 Telugu Contestants
Basha Shek
|

Updated on: Dec 25, 2023 | 3:16 PM

Share

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విజేత పల్లవి ప్రశాంత్‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. గ్రాండ్‌ ఫినాలే అనంతరం జరిగిన అల్లర్ల కేసులో రైతు బిడ్డపై కేసులు నమోదయ్యాయి. పోలీసులు అతనిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌ నిమిత్తం చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో శనివారం (డిసెంబర్‌ 24) సాయంత్ర జైలు నుంచి విడుదలయ్యాడు. పల్లవి ప్రశాంత్‌కు బెయిల్‌ రావడంలో ప్రముఖ సింగర్‌ భోలే షావలి కీలక పాత్ర పోషించాడు. అలాగే శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, అశ్విని శ్రీ, టేస్టీ తేజా, ప్రియాంక జైన్‌తో పాటు పలువురు ప్రముఖులు రైతు బిడ్డకు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ జైలు నుంచి రిలీజ్‌ కావడంతో బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌ మళ్లీ కలుసుకున్నారు. శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, టేస్టీ తేజా, భోలే షావలి, శుభ శ్రీ రాయగురు, నయని పావని అందరూ ఒకే చోట చేరారు. పల్లవి ప్రశాంత్‌ను కలిసి క్షేమ సమచారాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు బెయిల్‌ రావడంలో ప్రధాన పాత్ర పోషించిన భోలేపై తన అభిమానాన్ని చాటుకున్నాడు రైతు బిడ్డ. పాట బిడ్డను ఆప్యాయంగా హత్తుకున్నాడు. బదులుగా భోలే కూడా ప్రశాంత్‌కు ముద్దు పెట్టి భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు.

అనంతరం శివాజీతో పాటు కంటెస్టెంట్స్ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడారు. ‘నా గురించి ఈ పాటికే మీకు తెలిసే ఉంటుంది. నేను లోపల ఒక రకంగా, బయట ఒక రకంగా ఉండను. ఏదో ఒక ఎగ్జైట్‌మెంట్‌ ప్రశాంత్‌ కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుంటాడు. చట్టమే న్యాయం చేస్తుంది. ప్రశాంత్‌కి న్యాయం జరిగింది కాబట్టే తనకి బెయిల్ వచ్చింది. ప్రశాంత్‌ కు నేను చేతనైనంత చెబుతాను. ఇదేమీ మర్డర్ కేసో, క్రిమినల్ కేసో కాదు’ అని శివాజీ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ ‘శివన్న ఎప్పుడూ నా గుండెల్లో ఉంటాడు.. మీ అందరి ప్రేమాభిమానాలు గెలుచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని ఎమోషనల్‌ అయ్యాడు. ఇలా బిగ్‌ బాస్‌ కంటెస్టె్ంట్స్‌ అందరూ కలిసి సెలబ్రెట్ చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ టు గెదర్..

జైలు నుంచి బయటకు వస్తున్న ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌
కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే ఇవి తింటే చాలు
కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే ఇవి తింటే చాలు
పోలీస్‌ శాఖలో 1871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌
పోలీస్‌ శాఖలో 1871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌