- Telugu News Photo Gallery Cinema photos Super star Mahesh Babu fans expecting about rajamouli movie with mahesh babu movie in pan India film Telugu Heroes Photos
Mahesh Babu Pan India Film: మహేష్ బాబు ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ రాజమౌళితోనే సాధ్యమా.!
ప్రజెంట్ సౌత్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాస్త వెనకబడ్డారు. బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించే పర్ఫెక్ట్ లుక్స్ ఉన్న మహేష్ కాస్త కాన్సన్‌ట్రేట్ చేస్తే నార్త్‌లో సత్తా చాటడం పెద్ద విషయమే కాదు. అందుకే నెక్ట్స్ మూవీతో అయినా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. సౌత్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తున్నారు.
Updated on: Dec 25, 2023 | 9:49 PM

ప్రజెంట్ సౌత్ హీరోలంతా పాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ చేస్తున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే కాస్త వెనకబడ్డారు. బాలీవుడ్ ఆడియన్స్‌ను మెప్పించే పర్ఫెక్ట్ లుక్స్ ఉన్న మహేష్ కాస్త కాన్సన్‌ట్రేట్ చేస్తే నార్త్‌లో సత్తా చాటడం పెద్ద విషయమే కాదు.

అందుకే నెక్ట్స్ మూవీతో అయినా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. సౌత్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్‌ను శాసిస్తున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా అందరూ హీరోలు నెక్ట్స్ మూవీస్‌తో బిగ్ టార్గెట్ సెట్ చేశారు.

కానీ ఈ లిస్ట్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు మాత్రం కనిపించటం లేదు. రీజినల్ మార్కెట్‌లో టాప్ పోజిషన్‌లో ఉన్న మహేష్, నేషనల్ రేంజ్ మీద ఫోకస్ చేయట్లేదు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న గుంటూరు కారం సినిమా కూడా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతోంది.

మహేష్ అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ చేసి చాలా రోజులు అవుతుంది. కాబట్టి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవటం ఖాయం. కానీ ఇప్పుడు అంతకు మించి కావాలన్నది అభిమానుల కోరిక.

గుంటూరు కారం తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సూపర్ స్టార్. ఆల్రెడీ రాజమౌళి పాన్ ఇండియా దర్శకుడే కాబట్టి, మహేష్ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది.

ఈ సినిమాతో మహేష్ కూడా నేషనల్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వటం కన్ఫార్మ్ అయిపోయింది. అయితే పాన్ ఇండియా మార్కెట్‌లోకి జస్ట్ ఎంట్రీ ఇవ్వటం కాదు, ప్రభాస్, అల్లు అర్జున్‌లా తన మార్క్ చూపించాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సరైన కంటెంట్‌తో నార్త్ ఎంట్రీ ఇస్తే మహేష్ కూడా ప్రభాస్ లాగే రికార్డ్ తిరగరాయటం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. మరి ఫ్యాన్స్ కోరికను మహేష్ కన్సిడర్ చేస్తారేమో చూడాలి.




