Meena: ఆ హీరోతో లింక్‌ పెట్టడం బాధించింది.. రెండో పెళ్లి వార్తలపై మరోసారి స్పందించిన నటి మీనా

ఎంతో ఆనందంగా సాగుతున్న మీనా జీవితంలో గతేడాది తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా కాలమే పట్టింది. అయితే ఇదే సమయంలో మీనాపై కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. మీనా మళ్లీ పెళ్లి చేసుకోనుందని పుకార్లు షికార్లు చేశాయి.

Meena: ఆ హీరోతో లింక్‌ పెట్టడం బాధించింది.. రెండో పెళ్లి వార్తలపై మరోసారి స్పందించిన నటి మీనా
Actress Meena
Follow us

|

Updated on: Dec 27, 2023 | 7:02 PM

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైంది మీనా. ఆ తర్వాత స్టార్‌ హీరోయిన్‌గా మారింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, రజనీ కాంత్, మమ్ముట్టి, మోహన్‌లాల్‌ లాంటి దక్షిణాది స్టార్‌ హీరోలతో జోడి కట్టి అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్‌ హీరోయిన్‌గా సుమారు మూడు దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలిన మీనా కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది. వ్యాపార వేత్త విద్యాసాగర్‌తో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి నైనికా అనే పాప ఉంది. ఎంతో ఆనందంగా సాగుతున్న మీనా జీవితంలో గతేడాది తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్‌ అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి మీనాకు చాలా కాలమే పట్టింది. అయితే ఇదే సమయంలో మీనాపై కొన్ని రూమర్లు పుట్టుకొచ్చాయి. మీనా మళ్లీ పెళ్లి చేసుకోనుందని పుకార్లు షికార్లు చేశాయి. వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోన్న మీనా మరోసారి తన రెండో పెళ్లి వార్తలపై స్పందించింది. అలాగే తన ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘ నా భర్తకు లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సింది. అయితే చికిత్స ఆలస్యమైంది. దీంతో పరిస్థితి చేజారిపోయింది. ఆయన వెళ్లిపోయిన బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. అయితే నా భర్త చనిపోయిన రెండు నెలలకే నేను రెండో పెళ్లి చేసుకోబోతున్నానని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. అలాగే హీరో ధనుష్‌తో కూడా లింక్‌ చేశారు. చాలామందితో సంబంధం అంటగట్టారు. వీటిని చదివి నా కుటుంబీకులు ఎంత బాధపడుతారో కూడా ఆలోచించట్లేదు. ఇలాంటి పుకార్లను చూసి నాకు చాలా కోపం వచ్చింది. అయితే మీడియా ముందుకు రావడం నాకే మాత్రం ఇష్టం లేదు.ఇప్పట్లో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మాత్రం అసలు లేదు. అలాగనీ రేపు ఏం జరుగుతుందనేది నేను ఊహించలేను’ అని చెప్పుకొచ్చింది మీనా.

ఇవి కూడా చదవండి

క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో నటి మీనా..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

ముత్తు రీ రిలీజ్.. థియేటర్లలో మీనా సందడి..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

సీనియర్ నటీమణులతో మీనా..

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అదిరే లుక్‌లో మార్కెట్‌లోకి బీఎండబ్ల్యూ ఈవీ స్కూటర్ రిలీజ్..!
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
అయినా వీడని నిర్లక్ష్యం.. ఈసారి ఒకే ట్రాక్‌పైకి ఏకంగా 4 రైళ్లు
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
ఆ దేశాల్లో ట్యాక్స్ కట్టక్కర్లేదు.. పౌరుల ఆదాయంపై పరిమితులూ ఉండవ్
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన ప్రముఖ యంకర్.. వీడియో
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ముట్టుకుంటే మాసిపోతుంది.. పట్టుకుంటే కందిపోతుంది..!
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
ఎలక్ట్రిక్ స్కూటర్లు వాడుతున్నారా? వర్షాకాలంలో ఈ టిప్స్ మీ కోసం..
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
వయ్యారాల పరువం.. చీరకట్టు అందాలలో మేనకలా తాప్సీ వయ్యారాలు.
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
చిన్నవేకదా అని చిన్న చూపు చూడకండి.. పురుషులకు తిరుగులేని వరం..
పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..
పీతపై నరసింహస్వామి ఆకారం.. కోనసీమలో అద్భుతం.! వీడియో..
పవన్ కల్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
పవన్ కల్యాణ్ 'తొలి ప్రేమ' హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?