AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: సినిమాల్లోకి పల్లవి ప్రశాంత్‌.. హీరోగా ఎంట్రీ.. డీటెయిల్స్‌ చెప్పేసిన పాట బిడ్డ భోలే

బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిసి పది రోజులైనా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు పల్లవి ప్రశాంత్‌. తన పరువు తీసేలా దుష్పచారం చేసిన కొందరు యూట్యూబర్లు, యాంకర్లపై ప్రశాంత్ కేసులు వేయనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ రైతు బిడ్డకు సంబంధించిన ఒక విషయం అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

Pallavi Prashanth: సినిమాల్లోకి పల్లవి ప్రశాంత్‌.. హీరోగా ఎంట్రీ.. డీటెయిల్స్‌ చెప్పేసిన పాట బిడ్డ భోలే
Bhole Shavali, Pallavi Prashanth
Basha Shek
|

Updated on: Dec 27, 2023 | 9:06 PM

Share

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌తో రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్‌ అయిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఓ కామన్‌ మ్యాన్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను ఏకంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయి స్టార్ సెలబ్రిటీగా మారిపోయాడు. శివాజీ, అమర్‌ దీప్‌ లాంటి సెలబ్రిటీలను అధిగమించి మరీ బిగ్‌ బాస్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు పల్లవి ప్రశాంత్‌. అయితే కొందరి అభిమానుల అత్యుత్సాహం రైతు బిడ్డను జైలు పాలు చేసింది. గ్రాండ్‌ ఫినాలే అనంతరం అన్న పూర్ణ స్టూడియో ఎదుట జరిగిన అల్లర్ల కేసులో రైతు బిడ్డను అరెస్ట్ చేశారు పోలీసులు. రిమాండ్ నిమిత్తం చంచల్‌ గూడ జైలులో ఉంచారు. అయితే కోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో బయటకు వచ్చాడు. ఇదిలా ఉంటే బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే ముగిసి పది రోజులైనా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తున్నాడు పల్లవి ప్రశాంత్‌. తన పరువు తీసేలా దుష్పచారం చేసిన కొందరు యూట్యూబర్లు, యాంకర్లపై ప్రశాంత్ కేసులు వేయనున్నాడని తెలుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ రైతు బిడ్డకు సంబంధించిన ఒక విషయం అతని అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. అదేంటంటే.. బిగ్‌ బాస్‌ టైటిల్‌ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రైతు బిడ్డ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడట. కొందరు నిర్మాతలు పల్లవి ప్రశాంత్‌ను హీరోగా సినిమాలు నిర్మించేందుకు రెడీగా ఉన్నారట.

హౌజ్ లో ఉన్నప్పుడే..

బిగ్‌ బాస్‌ హౌజ్‌లో ఉన్నప్పుడు, అలాగే బయట పల్లవి ప్రశాంత్‌ కు అండగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌ పాట బిడ్డ భోలే షావలి స్వయంగా ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాట బిడ్డ..’ బిగ్‌ బాస్‌ హౌజ్‌ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్‌ కు సినిమా ఆఫర్లు వచ్చాయి. గ్రాండ్‌ ఫినాలే అనంతరం ఇదే విషయం చెప్పాలి అనుకున్నాను. అయితే అనూహ్యంగా అతను అరెస్ట్ అయి జైలుకు వైళ్లాడు. పల్లవి ప్రశాంత్‌ హీరోగా నేనే మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని అడుగుతున్నారు. అయితే అది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీదే ఆధారపడి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం భోలే కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

భోలే షావలితో పల్లవి ప్రశాంత్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌