AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా మృతుల ఖననానికి సొంత స్థలమిచ్చిన కెప్టెన్‌.. విజయకాంత్ సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకుంటోన్న ఫ్యాన్స్‌

నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు చేసుకున్న విజయ కాంత్‌ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కష్టాల్లో ఉన్న నటీనటులకు ఆర్థిక సాయం అందించారు. గతంలో పలు సార్లు కరోనా బారిన పడ్డారు డీఎండీకే అధినేత. అదే సమయంలో కొవిడ్‌ బాధితుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

కరోనా మృతుల ఖననానికి సొంత స్థలమిచ్చిన కెప్టెన్‌.. విజయకాంత్ సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకుంటోన్న ఫ్యాన్స్‌
Vijayakanth Family
Basha Shek
|

Updated on: Dec 28, 2023 | 2:55 PM

Share

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్‌ విజయకాంత్ గురువారం కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన గురువారం (డిసెంబర్‌ 28) ఉదయం తుది శ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం రాత్రే చెన్నైలోని మియాట్ ఇంటర్నేషనల్ ఆస్పత్రిలో చేరారు విజయకాంత్‌. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. దీనికి తోడు కరోనా మహమ్మారి మరోసారి ఆయనపై పగ బట్టింది. గురువారం ఉదయమే విజయ కాంత్‌కు కరోనా సోకినట్లు ప్రకటించిన వైద్యులు.. కొద్ది సేపటికే ఆయన కన్నుమూసినట్లు వెల్లడించారు. విజయ కాంత్ మృతితో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, చిరంజీవి, బాలకృష్ణ, రజనీ కాంత్‌ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు కెప్టెన్‌ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు చేసుకున్న విజయ కాంత్‌ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కష్టాల్లో ఉన్న నటీనటులకు ఆర్థిక సాయం అందించారు. గతంలో పలు సార్లు కరోనా బారిన పడ్డారు డీఎండీకే అధినేత. అదే సమయంలో కొవిడ్‌ బాధితుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి ఖననానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. దీనికి సంబంధించి కెప్టెన్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.

నిర్ణయం వెనక కారణమిదే..

గతంలో చెన్నైకి చెందిన ఓ డాక్టర్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశాడు. దీంతో వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. వైరస్‌ భయంతో అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన విజయ కాంత్‌ కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానని ప్రకటించారు. ఇందుకోసం తన అండాల్‌ అళగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని కొంగ భాగాన్ని ఖననానకి ఇస్తానని వెల్లడించారు. ఈ విషయాన్ని అందరూ స్వాగతించారు. జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ కూడా విజయ కాంత్‌ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలా ఎందరికో ఆపన్న హస్తం అందించిన విజయ కాంత్ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆయన అభిమానులు, డీఎండీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు విషాదంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

అప్పట్లో విజయ కాంత్ చేసిన ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.