AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar OTT: థియేటరల్లో రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీలోకి ప్రభాస్‌ ‘సలార్‌’.. అసలు విషయం ఏమిటంటే?

సలార్‌కు బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ రావడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గ సినిమా పడిందంటున్నారు. అయితే ప్రభాస్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో కొన్ని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అనుకున్న దాని కంటే ముందుగానే ప్రభాస్‌ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

Salaar OTT: థియేటరల్లో రిలీజైన నెలరోజుల్లోపే ఓటీటీలోకి ప్రభాస్‌ 'సలార్‌'.. అసలు విషయం ఏమిటంటే?
Salaar Movie
Basha Shek
|

Updated on: Dec 29, 2023 | 6:15 PM

Share

పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ పవర్‌ ప్యాక్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఏడు రోజుల్లోనే రూ. 550 కోట్ల కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. రాబోయే సంక్రాంతి సీజన్‌ వరకు పెద్ద సినిమాలేవీ రిలీజులకు నోచుకోవడం లేదు. దీంతో సలార్‌ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ప్రశాంత్ నీల్‌ తెరకెక్కించిన సలార్‌లో మలయాళ స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్ర పోషించాడు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా, ఈశ్వరి రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సలార్‌కు బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ రావడంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్‌ రేంజ్‌కు తగ్గ సినిమా పడిందంటున్నారు. అయితే ప్రభాస్‌ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్‌ మీడియాలో కొన్ని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అనుకున్న దాని కంటే ముందుగానే ప్రభాస్‌ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ప్రభాస్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే జనవరి 12నే ప్రభాస్‌ సినిమా ఓటీటీలోకి వస్తుందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి.

సాధారణంగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలో సినిమాలు రిలీజ్‌ అవుతాయి. అయితే సలార్‌ విషయంలో మాత్రం నెలరోజుల్లోపే ఓటీటీలో రిలీజ్‌ అవుతుండడంపై ప్రభాస్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు. థియేట‌ర్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు కేవలం ఇర‌వై రోజులు మాత్రమే గ్యాప్ క‌నిపిస్తోండ‌టంతో ఈ వార్తలను డార్లింగ్‌ ఫ్యాన్స్ కొట్టిప‌డేస్తున్నారు. జ‌న‌వ‌రి 12న స‌లార్ ఓటీటీలో రిలీజ్ అన్నది అబద్ధమంటూ ట్వీట్లు చేస్తున్నారు. జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలోనే సలార్‌ ఓటీటీ రిలీజ్‌ ఉంటుందంటున్నారు. మరి సలార్ చిత్ర బృందం ఓటీటీ రిలీజ్‌ వార్తలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

షారుక్‌ ఖాన్‌ డంకీ కూడా..

సలార్ తో పాటు షారుక్‌ ఖాన్‌ డంకీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఈ మూవీ జనవరి 1నే డిజిటల్‌ స్ట్రీమింగ్ కు వస్తుందని నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

సలార్ కొత్త సాంగ్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..