Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ‘సలార్‌’లో నటించేందుకు ఆ కండీషన్‌ పెట్టిన శ్రియా రెడ్డి.. అందుకే ‘రాధారమ’కు అంత మంచి పేరొచ్చిందా?

సలార్‌ సినిమాతో చాలా రోజుల తర్వాత వెండి తెరపై దర్శనమిచ్చింది శ్రియా రెడ్డి. రాధా రామ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా హీరోతో సమానంగా ఈ పాత్రకు స్పేస్‌ ఇచ్చారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. అందుకు తగ్గట్టుగానే తన అద్భుతమైన నటన, లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో రాధా రమ పాత్రకు ప్రాణం పోసింది శ్రియా రెడ్డి

Salaar: 'సలార్‌'లో నటించేందుకు ఆ కండీషన్‌ పెట్టిన శ్రియా రెడ్డి.. అందుకే 'రాధారమ'కు అంత మంచి పేరొచ్చిందా?
Sriya Reddy , Prabhas
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2023 | 6:07 PM

ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డిసెంబర్‌ 22న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. ఖన్సార్‌ ప్రపంచంలో ప్రశాంత్‌ నీల్‌ సృష్టించిన సరికొత్త ప్రపంచం, సినిమాలోని డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ప్రేక్షకులు పండగ చేసుకుంటున్నారు. ప్రభాస్‌తో పాటు మలయాళ సూపర్‌ స్టార్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, హీరోయిన్‌ శ్రుతి హాసన్‌, శ్రియారెడ్డి కీలక పాత్రల్లో మెరిశారు. కాగా సలార్‌ సినిమాతో చాలా రోజుల తర్వాత వెండి తెరపై దర్శనమిచ్చింది శ్రియా రెడ్డి. రాధా రామ మన్నార్ అనే పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించింది. ముఖ్యంగా హీరోతో సమానంగా ఈ పాత్రకు స్పేస్‌ ఇచ్చారు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌. అందుకు తగ్గట్టుగానే తన అద్భుతమైన నటన, లుక్‌, బాడీ లాంగ్వేజ్‌తో రాధా రమ పాత్రకు ప్రాణం పోసింది శ్రియా రెడ్డి. అయితే సలార్‌ సినిమాలో నటించే ముందే ప్రశాంత్ నీల్‌కు ఒక సీరియస్ కండిషన్‌ పెట్టిందట శ్రియా రెడ్డి.’ నేను మీ సినిమాలో నటించాలంటే హీరోతో సమానంగా నా పాత్రకు ప్రాధాన్యమివ్వాలి. కథానాయకుడిలా పవర్ ఫుల్ గా ఉండే రోల్ నాకూ ఉండాలి, లేకపోతే నేను నటించే ప్రసక్తి లేదు’ అని కండీషన్‌ పెట్టింది. శ్రియా రెడ్డి మాటలు విని ప్రశాంత్ నీల్ నవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే.. ‘రాధా రామ క్యారెక్టర్ అదే. నేను కూడా ఇతరులకన్నా పవర్ ఫుల్ గా ఉండాలనుకుంటున్నా. నువ్వు కూడా అదే అడుగుతున్నావ్’ అన్నాడు. నీల్ మాటలను బట్టి రాధ రామ పాత్ర ఎంత పవర్‌ఫుల్‌ అప్పుడే శ్రియా రెడ్డికి అర్థమైంది.

శ్రియా రెడ్డి 2002లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్‌గా కూడా కనిపించింది. ముఖ్యంగా పొగరులో విశాల్‌ను ఢీకొట్టే బలమైన విలన్‌ పాత్రలో శ్రియా అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇక ‘సలార్’ సినిమాలో ఆమె పాత్ర మరిన్ని ప్రశంసలు తెచ్చిపెట్టింది. సలార్‌తో ప్రభాస్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్, శృతి హాసన్, జగపతి బాబు, టిను ఆనంద్, కన్నడ గరుడ రామచంద్ర, మధు గురుస్వామి, బాబీ సింహా, బ్రహ్మాజీ, నవీన్ పంజు, బజరంగీ లోకి, దేవరాజ్, సప్తగిరి వంటి ప్రముఖులు నటించారు.

ఇవి కూడా చదవండి

సలార్ సినిమాలో శ్రియా రెడ్డి..

View this post on Instagram

A post shared by Sriya Reddy (@sriya_reddy)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..