- Telugu News Photo Gallery Cinema photos Keerthy Suresh looking for Movie offers in Film Industry on 30 12 2023 Telugu Actress Photos
Keerthy Suresh: అవకాశాలకోసం కీర్తి సురేష్ ఎదురుచూపులు.! దసరా కూడా హెల్ప్ చెయ్యలేదా అమ్మడికి.
అవును తెలియక అడుగుతున్నా.. అసలు కీర్తి సురేష్‌కు దసరా తీసుకొచ్చిన లాభమేంటి..? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే.. సినిమా హిట్టైతే ఆఫర్స్ రావాలిగా మరి..! పోనీ నటిగా నిరూపించుకోవాలా అంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అక్కడ.. బోనస్‌గా గ్లామర్ షో కూడా చేస్తుంది. మరి అన్నీ ఉన్నా అవకాశాలు రావట్లేదేంటబ్బా..? టాలీవుడ్‌ను కీర్తి పక్కనబెట్టిందా లేదంటే టాలీవుడ్డే కీర్తిని పట్టించుకోవట్లేదా..? స్క్రీన్ మీద ఇలా జోష్‌గానే తీన్మార్ వేస్తున్నారు కానీ.. అదే జోష్ కీర్తి సురేష్ కెరీర్‌లో అయితే కనిపించట్లేదు మరి
Updated on: Dec 30, 2023 | 9:16 PM

అవును తెలియక అడుగుతున్నా.. అసలు కీర్తి సురేష్‌కు దసరా తీసుకొచ్చిన లాభమేంటి..? ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే.. సినిమా హిట్టైతే ఆఫర్స్ రావాలిగా మరి..! పోనీ నటిగా నిరూపించుకోవాలా అంటే నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అక్కడ.. బోనస్‌గా గ్లామర్ షో కూడా చేస్తుంది.

మరి అన్నీ ఉన్నా అవకాశాలు రావట్లేదేంటబ్బా..? టాలీవుడ్‌ను కీర్తి పక్కనబెట్టిందా లేదంటే టాలీవుడ్డే కీర్తిని పట్టించుకోవట్లేదా..? స్క్రీన్ మీద ఇలా జోష్‌గానే తీన్మార్ వేస్తున్నారు కానీ.. అదే జోష్ కీర్తి సురేష్ కెరీర్‌లో అయితే కనిపించట్లేదు మరి.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. అందం, అభినయం ఉన్నా కీర్తి సురేష్ వైపు స్టార్ హీరోలు చూడట్లేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్స్‌తో రొమాన్స్ చేసినా.. నానితో వరస హిట్స్ కొట్టినా.. ఏది కీర్తి కెరీర్‌కు కలిసిరావట్లేదు.

పేరుకు ముందు మహానటి, స్టార్ హీరోయిన్ అంటూ బిరుదులు బానే ఉన్నాయి. కానీ ఏం లాభం..? ఆఫర్స్ తెచ్చిపెట్టని గౌరవాలు ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటున్నారు కీర్తి ఫ్యాన్స్. కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో ఈమెకు అవకాశాలు తగ్గాయి.

మహానటి తర్వాత వచ్చిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి కీర్తి ఇమేజ్ పెంచడం కాదు.. ఉన్న మార్కెట్ పాడు చేసాయి. రంగ్ దే, సర్కారు వారి పాట లాంటి సినిమాల్లో గ్లామర్ షో చేసినా పెద్దగా క్లిక్ అవ్వలేదు..

మొన్న దసరాలో వెన్నెలలా సినిమాను బతికించినా దర్శకులు కరుణించడం లేదు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత ఈమె తెలుగులో ఏ సినిమాకు సైన్ చేయలేదు. దీనికి ముందు రజినీ పెద్దన్నలోనూ చెల్లిగానే నటించినా అదీ ఫ్లాపే అయింది. తెలుగులో ఖాళీగానే ఉన్నా.. తమిళంలో మాత్రం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు కీర్తి.





























