AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Conjuring Kannappan OTT: ఓటీటీలో భయపెట్టనున్న కన్జూరింగ్‌ కన్నప్పన్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

రెజీనా నటించిన కార్తీక, నేనేనా వంటి సినిమాలు హార్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ జానర్‌కే చెందినవే. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ కోవలోనే రెజీనా నటించిన మరో సూపర్‌ హిట్‌ చిత్రం కన్‍జ్యూరింగ్ కన్నప్పన్. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

Conjuring Kannappan OTT: ఓటీటీలో భయపెట్టనున్న కన్జూరింగ్‌ కన్నప్పన్‌.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
Conjuring Kannappan Movie
Basha Shek
|

Updated on: Dec 31, 2023 | 7:46 PM

Share

గతంలో పలు సూపర్‌ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ రెజీనా కసాండ్ర. తెలుగులోనూ పలువురు స్టార్‌ హీరోలతోనూ నటించి ప్రేక్షకుల అభిమానాలు చూరగొంది. అయితే ఇప్పుడామె సిల్వర్‌ స్క్రీన్‌పై పెద్దగా కనిపించడం లేదు. ఎక్కువగా ఓటీటీల్లోనే దర్శనమిస్తోంది. అది కూడా హార్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ జానర్‌ సినిమాలు, వెబ్‌ సిరీసుల్లోనే నటిస్తోంది. రెజీనా నటించిన కార్తీక, నేనేనా వంటి సినిమాలు హార్రర్‌ అండ్‌ థ్రిల్లర్‌ జానర్‌కే చెందినవే. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ కోవలోనే రెజీనా నటించిన మరో సూపర్‌ హిట్‌ చిత్రం కన్‍జ్యూరింగ్ కన్నప్పన్. డిసెంబర్‌ 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది. దెయ్యాలు తిరిగే పీడకలల్లో చిక్కుకోవడం చుట్టూ ఈ మూవీ కథ కోలీవుడ్‌ ఆడియెన్స్‌ను బాగా అలరించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను భయపెట్టిన కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ హార్రర్‌ థ్రిల్లర్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది నెట్‌ఫ్లిక్స్‌.

ఇవి కూడా చదవండి

కన్‍జ్యూరింగ్ కన్నప్పన్ చిత్రంలో రెజీనాతో పాటు సతీశ్, నాజర్, ఆనంద్ రాజ్, శరణ్య పొన్వనన్, గణేశ్, రెజిన్ కింగ్‍స్లే తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకం ఈ చిత్రాన్ని నిర్మించింది. యువన్ శంకర్ రాజా బాణీలు అందించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. కన్నప్సన్‌ (సతీష్‌)కు గేమింగ్‌ ఇండస్ట్రీ అంటే చాలా ఆసక్తి. అతను డ్రీమ్ క్యాచర్‌ అనే ఒక వస్తువును తీసుకుని దాని నుంచి అద్బుతాలు క్రియేట్‌ చేస్తాడు. అయితే దీని వల్ల అతను నిద్రించిన ప్రతిసారి దెయ్యాల వలలో చిక్కుకుంటాడు. కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి ఈ సమస్య నుంచి కన్నప్పన్‌ ఎలా బయటపడ్డాడన్నదే మూవీ కథ.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే