AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Calling Sahasra OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్‌ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

రణ్‌ బీర్‌ కపూర్‌ యానిమల్‌ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్‌ కావడంతో కాలింగ్‌ సహస్ర మూవీ పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయింది. అయితే సుడిగాలి సుధీర్‌ను ఓ కొత్త రోల్‌లో చూపించడంతో ఫ్యా్న్స్‌కు బాగానే నచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌తో సరిపెట్టుకున్న కాలింగ్ సహస్ర ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా..

Calling Sahasra OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్‌ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Calling Sahasra Movie
Basha Shek
|

Updated on: Jan 01, 2024 | 4:54 PM

Share

గాలోడు సినిమాతో హీరోగా మొదటి హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు జబర్దస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్. అదే సక్సెస్‌ జోష్‌ను కొనసాగిస్తూ కాలింగ్ సహస్ర అనే ఓ డిఫరెంట్‌ మూవీతో మన ముందుకు వచ్చాడు. డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కథ, కథానాల్లో కొత్త దనం ఉన్నా రణ్‌ బీర్‌ కపూర్‌ యానిమల్‌ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్‌ కావడంతో కాలింగ్‌ సహస్ర మూవీ పెద్దగా ఆదరణ నోచుకోలేకపోయింది. అయితే సుడిగాలి సుధీర్‌ను ఓ కొత్త రోల్‌లో చూపించడంతో ఫ్యా్న్స్‌కు బాగానే నచ్చేసింది. థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌తో సరిపెట్టుకున్న కాలింగ్ సహస్ర ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా. కొత్త సంవత్సరం కానుకగా సోమ‌వారం (జ‌న‌వ‌రి 1) అర్ధ రాత్రి నుంచే సుధీర్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం కాలింగ్ సహస్ర సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

అరుణ్ విక్కిరాలా తెరకెక్కించిన కాలింగ్ సహస్ర సినిమాలో సుధీర్ సరసన డాలీషా కథానాయికగా నటించింది. స్పందన, శివబాలాజీ, సుభాష్, రవిప్రకాశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోహిత్ రెహమానిక్ సంగీతం అందించారు. షాడో మీడియా ప్రొడ‌క్షన్స్‌, రాధా ఆర్ట్స్ బ్యాన‌ర్లపై విజేష్ తాయ‌ల్‌, చిరంజీవి పామిడి, వెంక‌టేశ్వర్లు కాటూరి సంయుక్తంగా కాలింగ్ సహస్ర సినిమాను తెర‌కెక్కించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఓ సిమ్ ద్వారా అజ‌య్ శ్రీవాత్సవ (సుడిగాలి సుధీర్‌) లైఫ్‌లోకి స‌హ‌స్ర వ‌స్తుంది. అస‌లు ఆమె ఎవ‌రు? స‌హ‌స్ర గురించిన అన్వేష‌ణ‌లో అజ‌య్ తెలుసుకున్న వాస్తవాలేమిటి? త‌న సోద‌రి మ‌ర‌ణం వెనకనున్న మిస్టరీని అజయ్‌ ఎలా ఛేదించాడన్నదే కాలింగ్‌ సహస్రి సినిమా కథ. సస్పెన్స్‌, థ్రిల్లర్‌, మిస్టరీ సినిమాలు చూసే వారికి కాలింగ్‌ సహస్ర మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు సుధీర్.

ఇవి కూడా చదవండి

 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న  కాలింగ్ సహస్ర..

సుడిగాలి సుధీర్ న్యూ ఇయర్ విషెస్..

  కాలింగ్ సహస్ర ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?