That Is Mahalakshmi OTT: డైరెక్టుగా ఓటీటీలోకి తమన్నా మూవీ.. షూటింగ్ పూర్తైన 8 ఏళ్లకు స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దటీజ్ మహాలక్ష్మి'. కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ మూవీ 'క్వీన్' ఆధారంగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధూ జొన్నలగడ్డ మరో కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితమే దటీజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తయ్యింది
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘దటీజ్ మహాలక్ష్మి’. కంగనా రనౌత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘క్వీన్’ ఆధారంగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ మూవీని తెరకెక్కించారు. సిద్ధూ జొన్నలగడ్డ మరో కీలక పాత్ర పోషించాడు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితమే దటీజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తయ్యింది. 2014లో ఈ మూవీని ప్రకటించి 2016లోనే షూటింగ్ పూర్తి చేశారు మేకర్స్. పోస్టర్స్, టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే దక్షిణాది రీమేక్ రైట్స్ విషయంలో వివాదాలు చుట్టుముట్టాయి. దీంతో దటీజ్ మహాలక్ష్మి విడుదలకు నోచుకోలేదు. అప్పుడప్పుడూ వార్తల్లో నిలుస్తోన్న ఈ మూవీ గురించి జనాలు కూడా మర్చిపోయారు. అయితే తాజాగా దటీజ్ మహాలక్ష్మి సినిమాను థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విడుదల చేస్తే ఆడియెన్స్ ఆదరిస్తారో, లేదోనన్న అనుమానాలు ఉండడంతో డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి తీసుకురానున్నారట. దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దటీజ్ మహాలక్ష్మీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.
గతంలోనూ దటీజ్ మహాలక్ష్మి సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి రానున్నట్లు వార్తలు వచ్చాయి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. అయితే అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. మళ్లీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అంటున్నారు. మరి ఈసారైనా మహాలక్ష్మీ రిలీజ్‌కు మోక్షం కలుగుతుందో లేదో చూడాలి. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది జైలర్, భోళాశంకర్ సినిమాల్లో నటించింది తమన్నా. అలాగే లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, ఆఖరి సచ్ అనే వెబ్ సిరీస్‌లతో ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించింది. ప్రస్తుతం కోలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ఆరణ్మణై 4లో నటిస్తోంది.
దటీజ్ మహాలక్ష్మీ టీజర్..
తమన్నా 18 ఏళ్ల సినిమా కెరీర్..
From teen dreams to adult realisations…. from a damsel in distress and the girl next door to a badass bouncer and now a fearless investigator… what a ride it’s been! 18 years on this journey to eternity with my first true love… acting. 🥰 pic.twitter.com/hqNmuKaib0
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 1, 2023
ఆరణ్మణై4 లో మిల్కీ బ్యూటీ..
Here is the smashing first look of the much awaited #Aranmanai4 👻🔥Hold on to your seats, we’ll see you in Pongal 2024!! #SundarC @khushsundar @benzzmedia #Raashikhanna @iYogiBabu #VTVGanesh @hiphoptamizha @dineshashok_13 @galaxycinemass @teamaimpr pic.twitter.com/3O0tikcuif
— Tamannaah Bhatia (@tamannaahspeaks) September 29, 2023