Animal Movie OTT : అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి యానిమల్ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో సంచలన హిట్ ను అందుకున్నాడు. యానిమల్ సినిమా గత ఏడాది డిసెంబర్ 1న విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది.
గత ఏడాది ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో యానిమల్ సినిమా ఒకటి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్డ్ డైరెక్టర్ గా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆతర్వాత ఇదే సినిమాను బాలీవుడ్ లో తెరకెక్కించి మరో సారి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో సంచలన హిట్ ను అందుకున్నాడు. యానిమల్ సినిమా గత ఏడాది డిసెంబర్ 1న విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన ఈ సినిమాకు తెలుగు, హిందీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తి నెలకొంది. యానిమల్ సినిమా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల స్క్రీనింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. జనవరి 26న స్ట్రీమింగ్ అవుతుందంటూ మొనీమధ్య ప్రచారం జరిగింది . అయితే ఈ సినిమా ఇప్పుడు అనుకున్న దాని కంటే ముందుగానే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.
యానిమల్ సినిమా ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. ఇక యానిమల్ సినిమాను జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన కూడా ఇవ్వనున్నారు. యానిమల్ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించాడు. అలాగే అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను భారీగానే వసూల్ చేసింది. మరి ఓటీటీలో ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Soul stirring #PapaMeriJaan #NannaNuvNaaPranam #NeeEnUlagam #NannaRaviNeene #NeeyanakhilamThaathaa full video out now❤️🔥https://t.co/rUux0OaYrS#Animal #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor… pic.twitter.com/wFg1kivSWc
— Animal The Film (@AnimalTheFilm) January 2, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..