Guess The Actor: మెడలో రుద్రాక్షలు.. తలపై కొమ్ముల కిరీటం.. భయపెడుతోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?

మెడలో రుద్రాక్షలు.. తలపై కొమ్ములతో కిరీటం.. నిజం చెప్పాలంటే చేతబడులు చేసే మాంత్రికుడిలాగా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. మరి తన ఉగ్రరూపంతో భయపెడుతోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? లేదా? మమ్మల్నే సమాధానం చెప్పేయమంటారా? ఆయన మరెవరో కాదు..

Guess The Actor: మెడలో రుద్రాక్షలు.. తలపై కొమ్ముల కిరీటం.. భయపెడుతోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?
Actor
Follow us
Basha Shek

|

Updated on: Jan 02, 2024 | 5:43 PM

మెడలో రుద్రాక్ష మాల.. తలపై కొమ్ములతో కిరీటం.. దేవతామూర్తి కళ్లు.. ఇలా తన ఉగ్రరూపంతో ప్రేక్షకులను భయపెడుతోన్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తు పట్టారా? భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 40 ఏళ్ల అనుభవం ఈ సీనియర్‌ హీరో సొంతం. లవ్‌, ఫ్యామిలీ, యాక్షన్‌, రొమాన్స్‌, హార్రర్‌, థ్రిల్లర్‌.. ఇలా అన్ని జానర్ల సినిమాల్లోనూ నటిస్తారాయాన. తన వర్సటైల్‌ యాక్టింగ్‌తో పాత్రలకు ప్రాణం పోయడంలో ముందుంటారీ స్టార్ హీరో. అందుకే తన నటనా ప్రతిభకు గుర్తింపుగా లెక్కలేనన్ని అవార్డులు, రివార్డులు, ప్రశంసలు వచ్చాయి. పేరుకు మలయాళ హీరోనే అయినా.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన బాగా సుపరిచితం. గతంలో హీరోగా పలు సూపర్‌ హిట్‌ తెలుగు సినిమాల్లో నటించారు. స్పెషల్‌ రోల్స్‌లోనూ సందడి చేశారు. 72 ఏళ్ల వయసులోనూ తన దైన నటనతో అభిమానులను అలరిస్తున్నారాయన. నూతన సంవత్సరం కానుకగా ఈ వెర్సటైల్‌ హీరో కొత్త సినిమా పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. అందులో ఒక డిఫరెంట్‌ లుక్‌తో కనిపించారు. మెడలో రుద్రాక్షలు.. తలపై కొమ్ములతో కిరీటం.. నిజం చెప్పాలంటే చేతబడులు చేసే మాంత్రికుడిలాగా దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. మరి తన ఉగ్రరూపంతో భయపెడుతోన్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా? లేదా? మమ్మల్నే సమాధానం చెప్పేయమంటారా? ఆయన మరెవరో కాదు మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి.

గతేడాది అక్కినేని అఖిల్‌ ఏజెంట్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకును పలకరించారు మమ్ముట్టి. అలాగే కన్నూర్‌ స్వ్కాడ్‌ వంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఇక్కడి ఆడియెన్స్‌ను మెప్పించారు. ఈసారి మనల్ని భయపెట్టేందుకు ఓ డిఫరెంట్‌ సినిమాతో వస్తున్నారు. మమ్ముట్టి నటిస్తోన్న తాజా చిత్రం భ్రమయుగం. రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తోన్న ఈ పాన్‌ ఇండియా మూవీలో అర్జున్‌ అశోకన్‌, సిద్ధార్థ్‌, భరతన్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగా హార్రర్‌ థ్రిల్లర్‌గా భ్రమయుగం సినిమాను తెరకెక్కిస్తున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకు క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భ్రమయుగం నుంచి కొత్త పోస్టర్..

యాత్ర 2 సినిమాలో మమ్ముట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
జాతకంలో గురు దోషమా.. గురువారం ఈ పరిహారాలు చేసి చూడండి..
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ఇంటర్‌ పరీక్షల ఫీజు తుది గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ట్రావిస్ హెడ్ 2.0.. భారత బౌలర్ల బెండ్ తీసిన 19 ఏళ్ల కుర్రాడు
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..