- Telugu News Photo Gallery Cinema photos 2023 remains a nightmare for them but a sweet memory for some heroes
2023 Movies: వీరికి పీడకలగా మిగిలిన 2023.. ఈ హీరోలకి మాత్రం తీపి జ్ఞాపకం..
చూస్తుండగానే 2023 అయిపోయింది.. కొత్త ఏడాది వచ్చేసింది.. కాలెండర్ మారిపోయింది. మరి గత ఏడాది 365 రోజుల్లో ఏం జరిగింది..? ఎవరికి బాగా కలిసొచ్చింది..? ఎవరు 2023ని మరిచిపోవాలనుకుంటున్నారు.. ఈ ఇయర్ సర్‌ప్రైజింగ్ స్టార్స్ ఎవరు..? ఇవన్నీ ఓ షార్ట్ రివ్యూలో చూసేద్దాం పదండి.. 2023లో చాలా అద్భుతాలు జరిగాయి.. చాలా దారుణమైన నష్టాలు కూడా వచ్చాయి.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Jan 02, 2024 | 5:35 PM

చూస్తుండగానే 2023 అయిపోయింది.. కొత్త ఏడాది వచ్చేసింది.. కాలెండర్ మారిపోయింది. మరి గత ఏడాది 365 రోజుల్లో ఏం జరిగింది..? ఎవరికి బాగా కలిసొచ్చింది..? ఎవరు 2023ని మరిచిపోవాలనుకుంటున్నారు.. ఈ ఇయర్ సర్‌ప్రైజింగ్ స్టార్స్ ఎవరు..? ఇవన్నీ ఓ షార్ట్ రివ్యూలో చూసేద్దాం పదండి..

2023లో చాలా అద్భుతాలు జరిగాయి.. చాలా దారుణమైన నష్టాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్ అయితే రెండు సినిమాలతో కలిపి 800 కోట్లకు పైగానే వసూలు చేసారు. ఆదిపురుష్ నిరాశ పరిచినా.. సలార్ బాక్సాఫీస్‌పై యుద్ధం చేస్తున్నాడు. ఇక చిరంజీవి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టి భోళా శంకర్‌తో నిరాశ పరిచారు. బాలయ్యకు మాత్రం 2023 తీపి జ్ఞాపకంగా నిలిచింది.

రవితేజ మూడు సినిమాలతో వచ్చినా.. హీరోగా సక్సెస్ కాలేకపోయారు. వాల్తేరు వీరయ్య హిట్టైనా అది చిరు ఖాతాలోకి వెళ్లిపోయింది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు మాత్రం డిజాస్టర్ అయ్యాయి. కళ్యాణ్ రామ్‌కు అమిగోస్ నిరాశ పర్చగా.. డెవిల్ ఈ మధ్యే విడుదలైంది. సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో రప్ఫాడించారు.. ఇక పవన్‌తో నటించిన బ్రో మాత్రం నిరాశ పరిచింది.

నానికి కూడా 2023 బాగా కలిసొచ్చింది. సమ్మర్‌లో దసరా.. చివర్లో హాయ్ నాన్నతో మంచి విజయాలు అందుకున్నారు నేచురల్ స్టార్. బేబీ, బలగం, మ్యాడ్, సామజవరగమనా లాంటి చిన్న సినిమాలు ఈ ఏడాది సర్‌ప్రైజింగ్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే బేబీతో వైష్ణవి చైతన్య 2023లో మోస్ట్ సర్‌ప్రైజింగ్ స్టార్ అయిపోయారు.

కొందరు హీరోలకు మాత్రం 2023 పీడకలగా నిలిచింది. రామ్, నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోలు ఈ ఏడాది కూడా హిట్టు కొట్టలేకపోయారు. మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లకు నిరాశ తప్పలేదు. కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్ లాంటి హీరోలు దండయాత్రలు చేసినా ఫలితం దక్కలేదు. మొత్తానికి 2023 కొంచెం తీపి కొంచెం చేదుగా గడిచిపోయింది.





























