AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Megastar Chiranjeevi: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టితో మెగాస్టార్ భేటీ.. అభినందనలు తెలిపిన చిరంజీవి దంపతులు..

ఇప్పటికే, సీఎం రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపిన మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సతీసమేతంగా ప్రజాభవన్‌కు వచ్చిన వారిద్దరిని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకున్నారు భట్టి. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం మెగా దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. చిరంజీవి కూడా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను సన్మానించారు. కశ్మీర్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో భట్టిని సత్కరించారు.

Megastar Chiranjeevi: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టితో మెగాస్టార్ భేటీ.. అభినందనలు తెలిపిన చిరంజీవి దంపతులు..
Megastar Chiranjeevi, Bhatt
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2024 | 12:14 PM

Share

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అభినందనలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులను కలుస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే, సీఎం రేవంత్‌ను కలిసి అభినందనలు తెలిపిన మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పుడు తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సతీసమేతంగా ప్రజాభవన్‌కు వచ్చిన వారిద్దరిని ఆప్యాయంగా రిసీవ్‌ చేసుకున్నారు భట్టి. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం మెగా దంపతులకు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. చిరంజీవి కూడా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను సన్మానించారు. కశ్మీర్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శాలువాతో భట్టిని సత్కరించారు. అలాగే భట్టి విక్రమార్క సైతం చిరంజీవిని శాలువాతో సత్కరించారు.

పరస్పర సన్మానాల తర్వాత ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో భట్టి సతీమణితోపాటు ఆయన కుమారుడు విక్రమాదిత్య కూడా పాల్గొన్నారు. కుషల ప్రశ్నలతోపాటు పలు విషయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు ఇరువురు.

అనంతరం, బహుమతులను ఇచ్చి పుచ్చుకున్నారు భట్టి, చిరంజీవి దంపతులు. చాలా సంతోషంగా ఆప్యాయంగా సాగింది వీళ్లిద్దరి భేటీ. కాంగ్రెస్‌ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు మెగాస్టార్‌. డిప్యూటీ పదవి చేపట్టినందుకు భట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే.. సినీ పరిశ్రమ విషయాలు కూడా వివరించి చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భట్టి, చిరు భేటీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
రాత్రి మిగిలిన అన్నం తో కమ్మని బ్రేక్‌ఫాస్ట్ రెడీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
పెళ్లి.. వ్యామోహం.. ప్రేమ.. కుట్ర.. ఆస్కార్ ఎంట్రీ సినిమా స్టోరీ
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ఆంధ్రా స్పెషల్ నల్ల కారం పొడి.. వేడి అన్నం లోకి అద్భుతంగా ఉంటుంది
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
ట్రైన్‌లో టికెట్ చెక్ చేస్తే.. మహిళ హైడ్రామా!
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
తిరుమల అన్నప్రసాదంలో వడ్డించే అసలైన కొబ్బరి పచ్చడి
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఆదివారం ఇలా చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహం.. ఆరోగ్యం, ఐశ్వర్యం..
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఈ సీక్రెట్ పేస్ట్ వేస్తే భోజనాల్లో వడ్డించే కమ్మటి సాంబార్ రెడీ
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
ఆ హీరోయిన్ నాకు నటనలో పోటీగా ఉండేది..
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
10 గుడ్లు, పండ్లు తిన్నా రాని సత్తువ.. రెండు గుప్పెళ్ళు తింటే చాల
అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!
అమెరికా వెళ్తున్నారా..? విమానాశ్రయంలో మీ ఫోన్లు చెక్‌ చేయొచ్చు!